Apple: యాపిల్ లో 600 మంది ఉద్యోగుల తొలగింపు.. కార్లు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్టుల రద్దు ఎఫెక్ట్
ఐఫోన్ తయారీదారు ఆపిల్, కాలిఫోర్నియాలో 600మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విషయాన్నికంపెనీ ఇటీవల కాలిఫోర్నియా 'ఎంప్లాయిమెంట్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్'కు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. కార్, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లేలకు చెందిన ప్రాజెక్టులను నిలిపివేయడంతో ఆ సంస్థ ఉద్యోగుల్ని తొలగించింది. తొలగించబడిన ఉద్యోగుల్లో 87మంది యాపిల్ ఫెసిలిటీ సెంటర్‌కు చెందిన వాళ్లు ఉన్నారు.వాళ్లు కొత్తతరం స్క్రీన్ డెవలప్‌మెంట్‌ను తయారు చేయడంలో ఇన్నాళ్లూ పనిచేశారు. నెక్స్ట్ జనరేషన్ టెక్ ప్రపంచంలోకి అడుగుపెట్టడంలో భాగంగా స్మార్ట్ కారు,డిస్‌ప్లే ప్రాజెక్టులను యాపిల్ చేపట్టింది. కానీ,భారీ ఖర్చు సహా వివిధ కారణాలతో వాటిని పక్కన పెట్టింది.డిస్‌ప్లే ప్రాజెక్టు విషయంలో ఇంజినీరింగ్,సరఫరా వంటి సమస్యలూ కూడా తలెత్తింది . స్మార్ట్‌కారుపై పనిచేస్తున్నవారిలో కొంతమందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,రోబోటిక్స్ వంటి ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారు.