Tamil Nadu State Film Awards: తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. ఫిబ్రవరి 13న ప్రధానోత్సవం.. అదరగొట్టిన 'జై భీమ్'
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 'తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్'ను ప్రకటించింది. 2016 నుండి 2022 మధ్య విడుదలైన తమిళ సినిమాలకే ఈ అవార్డులు వర్తిస్తాయి. ఈసారి సూర్య ప్రధాన పాత్రలో కనిపించిన 'జై భీమ్' సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ చిత్రం మొత్తం ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుని అద్భుత ప్రతిభను ప్రదర్శించింది. 2021లో విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరంలోనే అత్యధిక అవార్డులను సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, విలన్, సహాయ నటుడు, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు వంటి ప్రధాన విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఈ పురస్కారాల ప్రధానోత్సవం ఫిబ్రవరి 13న జరగనుంది. పూర్తి విజేతల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...
వివరాలు
2016
ఉత్తమ చిత్రం: మానగరం ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి ఉత్తమ నటి: కీర్తి సురేశ్ 2017 ఉత్తమ చిత్రం: ఆరం ఉత్తమ నటుడు: కార్తి ఉత్తమ నటి: నయనతార 2018 ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాల్ ఉత్తమ నటుడు : ధనుష్ ఉత్తమ నటి: జ్యోతిక 2019 ఉత్తమ చిత్రం : అసురన్ ఉత్తమ నటుడు: ఆర్.పార్థిబన్ ఉత్తమ నటి: ముంజువారియర్ 2020 ఉత్తమ చిత్రం : కూజంగల్ ఉత్తమ నటుడు: సూర్య ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి
వివరాలు
2021
ఉత్తమ చిత్రం: జై భీమ్ ఉత్తమ నటుడు: ఆర్య ఉత్తమ నటి: లిజోమోల్ జోస్ 2022 ఉత్తమ చిత్రం: గార్గి ఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు ఉత్తమ నటి: సాయి పల్లవి