లే ఆఫ్స్: గడిచిన ఐదు నెలల్లో 2లక్షల ఉద్యోగులను తొలగించిన టెక్ కంపెనీలు
ప్రస్తుతం లే ఆఫ్స్ యుగం నడుస్తోంది. కంపెనీలు తమపై ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసివేస్తున్నాయి. కంపెనీని ఆర్థికంగా స్థిరపరిచేందుకు ఈ విధమైన నిర్ణయాలను తీసుకుంటున్నట్లుగా టెక్ సంస్థలు చెబుతున్నాయి. గతేడాది 1056 టెక్ సంస్థలు సుమారు 1.64లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది ఈ నంబర్ మరింత ఎక్కువగా ఉండనుంది. లేఆఫ్ లను ట్రాకింగ్ చేసే వెబ్ సైట్ layoff.fyi వివరాల ప్రకారం, 2023 మే 18వ తేదీ వరకు 699 టెక్ సంస్థలు, 1,97, 985మంది ఉద్యోగులను తొలగించాయి. గడిచిన ఐదు నెలల్లోనే ఈ రేంజ్ లో జాబ్స్ తీసేస్తుంటే, సంవత్సరం పూర్తయ్యేసరికి చాలామంది లేఫ్స్ కి గురవుతారని అర్థమవుతోంది.
కరోనాను కారణంగా చూపుతూ లేఆఫ్స్
ప్రపంచ వ్యాప్తంగా గూగుల్, ట్విట్టర్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ మొదలగు సంస్థలు ఎక్కువ మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇండియాలో అయితే షేర్ ఛాట్, డంజో, రెబెల్ ఫుడ్స్, భారత్ అగ్రి మొదలగు కంపెనీలు ఎక్కువ మొత్తంలో ఉద్యోగులను తీసివేసాయి. యాక్సెంచర్ తన మొత్తం ఉద్యోగుల్లోంచి 2.5శాతం అంతే 19వేల మందిని తొలగించింది. కరోనా మహమ్మారి, రిక్రూట్ మెంట్ లో తప్పులు, ద్రవ్యోల్బణం కారణంగా లే ఆఫ్స్ చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. దాదాపు చాలా టెక్ సంస్థలు లే ఆఫ్స్ చేస్తుంటే, యాపిల్ మాత్రం లే ఆఫ్స్ కి విరుద్దంగా ఉంది. యాపిల్ సంస్థలో 2016నుండి రిక్రూట్ మెంట్ రేటు ఒకే విధంగా ఉంది.