భారత్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్
అమెజాన్ ఇండియాలో లేఆఫ్ ప్రక్రియ కొనసాగుతోంది. వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్‌మెంట్, ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలోని వివిధ వర్టికల్స్‌లో సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చిలో అమెజాన్‌లో 9వేల ఉద్యోగుల తొలగింపు ఉంటుందని సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటించారు. ఈ తొలగింపులో భారత్ నుంచి పని చేస్తున్న గ్లోబల్ టీమ్ సభ్యులు ఉండొచ్చని సోర్సెస్ చెబుతున్నాయి. ఆ ప్రకటనలో భాగంగా తాజా లే ఆఫ్స్‌ను ప్రకటించారు.
భారత్‌లో తగ్గిన ఈ -కామర్స్ వ్యాపారం
ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ గత సంవత్సరంలో ఇ-కామర్స్ వృద్ధిలో తీవ్రమైన మందగమనాన్ని చూసింది. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు దుకాణాలకు వెళ్లడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ స్టాక్‌లు క్షీణించడంతో సుమారు 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ మొదట జనవరిలో ప్రకటించింది. ఆ తర్వాత మార్చిలో 9వేల మందిని తొలగిస్తున్నట్లు స్వయంగా సీఈఓనే వెల్లండించారు. ఈ క్రమంలో చూసుకుంటే అమెజాన్‌లో లేఆఫ్స్ ఇంకా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి