మే నెలలో AI కారణంగా 4వేల మంది టెకీల తొలగింపు; టెక్ సెక్టార్‌లో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి.
మార్కెట్ అస్థిరత, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఖర్చును తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు క్రమక్రమంగా లేఆఫ్స్‌ను ప్రకటిస్తున్నాయి.
తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వల్ల కూడా ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోతున్నారని అమెరికాకు చెందిన ప్రముఖ అవుట్‌ప్లేస్‌మెంట్ సేవల సంస్థ 'ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్' తమ మే నేల నివేదికలో వెల్లడించినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపింది.
AIవినియోగం వల్ల ఒక్క మే నెలలోనే దాదాపు 4,000మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని నివేదిక వెల్లడించింది.
AIకారణంగా ఉద్యోగాల కోత జరగడం ఇదే మొదటిసారి అని 'ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్' ప్రతినిధి ఇన్‌సైడర్‌తో చెప్పారు. ఈ తొలగింపులన్నీ టెక్ రంగానికి చెందినవేనని తెలిపారు.
ఏఐ
మానవ వనరుల స్థానంలో ChatGPTని వాడుతున్న కొన్ని కంపెనీలు
గత నెలలో మొత్తం 80,000మంది తమ ఉద్యోగాలను తొలగించారని నివేదిక పేర్కొంది.
వీటిలో AI కారణంగానే 3,900ఉద్యోగాల కోతలు జరిగాయని వెల్లడించింది.
ఇతర ఉద్యోగాల కోతల వెనుక ఆర్థిక పరిస్థితులు, ఖర్చు తగ్గింపు, కంపెనీలో పునర్నిర్మాణం లేదా విలీనాలు లాంటి కారణాలు ఉన్నాయని నివేదిక చెప్పింది.
ఈ నివేదిక 2023లో ఇప్పటివరకు జరిగిన మొత్తం ఉద్యోగాల కోతలను కూడా వివరించింది.
జనవరి నుంచి మే వరకు దాదాపు 4లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు కోల్పోయారు.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఉద్యోగ సలహా వేదిక అయిన Resumebuilder.com నిర్వహించిన మరో సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
కొన్ని US ఆధారిత కంపెనీలు మానవ వనరుల స్థానంలో ChatGPTని వినియోగంచడం ప్రారంభించాయని వెల్లడించింది.