Page Loader
5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్ 
5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్

5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్ 

వ్రాసిన వారు Stalin
Jun 07, 2023
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన రెడ్డిట్ తన కంపెనీలో 5 శాతం మంది లేదా 90మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ హఫ్ఫ్‌మన్ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపారు. తద్వారా అమెరికా అంతటా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలోకి రెడ్డిట్ వెళ్లింది. మెటా ప్లాట్‌ఫారమ్‌లతో సహా టెక్ కంపెనీలు మహమ్మారి సమయంలో దూకుడుగా నియామకం చేసిన తర్వాత ఉద్యోగాలను తగ్గించాయి, ఎందుకంటే పరిశ్రమ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. ఫేస్‌బుక్ సహా ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలన్నీ లైఆఫ్‌ల బాట పట్టాయి. ఆర్థిక మాంద్యం, అనిశ్చితి నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపే మార్గంగా ఆయా కంపెనీలు ఎంచుకున్నాయి.

టెక్

రెడ్డిట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2వేల మంది ఉద్యోగులు

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది 300 మందిని నియమించుకోవాలని రెడ్డిట్ యాజమాన్యం నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను 100 మందికి తగ్గింది. రెడ్డిట్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2వేల మందికి పని చేస్తున్నట్లు యాజనాన్యం తెలిపింది. 2024 నాటికి కంపెనీలోని కార్యకలాపాలను సమీక్షించి, తిరిగి కొలిక్కి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ ఏడాది తొలి 6నెలల్లో కంపెనీ పనీతీరు కూడా బాగా ఉందని పేర్కొంది. 2005లో స్టీవ్ హఫ్ఫ్‌మన్, అలెక్సిస్ ఒహానియన్‌లతో స్థాపించబడిన రెడ్డిట్, 50 మిలియన్ల కంటే ఎక్కువ రోజువారీ వినియోగదారులను కలిగి ఉంది.