అమెరికా ప్రెసిడెంట్ బిడ్ కు సిద్దపడుతున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక ప్రత్యేకత సంతరించుకోనున్నాయి. ప్రెసిడెంట్ రేసులో భారత సంతతికి చెందిన కొందరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. వారిలో మిలియనీర్ వివేక్ రామస్వామి ఒకరు. రామస్వామి 1985లో ఒహియోలోని సిన్సినాటిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు కేరళ నుండి అక్కడకు వలస వెళ్లారు. అతను 2003-2007 వరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివాడు, అక్కడ అతను సెల్యులార్ బయాలజీని అభ్యసించాడు. హార్వర్డ్ నుండి పట్టా పొందిన తరువాత, రామస్వామి యేల్ లా స్కూల్ నుండి న్యాయ పట్టా పొందారు. రామస్వామి QVT ఫైనాన్షియల్ LPలో తన వృత్తిని ప్రారంభించారు, అక్కడ ఏడు సంవత్సరాలు పనిచేశారు. కంపెనీలో బయోటెక్-స్టాక్ అనలిస్ట్‌గా, అతను ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంపై దృష్టి పెట్టారు.
2015లో ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో రామస్వామి పేరు వచ్చింది
2014లో, అతను తన ఫార్మాస్యూటికల్ వెంచర్, రోవియంట్ సైన్సెస్‌ని స్థాపించాడు. 2015లో ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో రామస్వామి పేరు వచ్చింది. రామస్వామి సాధించిన విజయాలు కార్పొరేట్ ప్రపంచానికే పరిమితం కాలేదు. 2021లో, అతను రాసిన పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ లిస్ట్‌లో 2వ స్థానంలో నిలిచింది. నేషన్ ఆఫ్ విక్టిమ్స్: ఐడెంటిటీ పాలిటిక్స్, ది డెత్ ఆఫ్ మెరిట్, అండ్ ది పాత్ బ్యాక్ టు ఎక్సలెన్స్ అనే మరో పుస్తకాన్ని రాశాడు. రామస్వామి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలని ఆకాంక్షించారు. త్వరలో తన ప్రెసిడెంట్ బిడ్‌ను ప్రకటించడానికి సిద్ధంగా పడుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో ప్రసంగిస్తూ ఇప్పటికే అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.