LOADING...
చైనాకు సారీ చెప్పను.. అమెరికా అధ్యక్షుడు
త్వరలో చైనా అధ్యక్షుడితో మాట్లాడుతానని చెప్పిన జోబెడైన్

చైనాకు సారీ చెప్పను.. అమెరికా అధ్యక్షుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2023
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల అమెరికా గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బెలూన్ ఘటన అమెరికా, చైనా సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బెలూన్ కూల్చిన ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పనని, అలాగే తాను త్వరలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మాట్లాడుతానని చెప్పారు. తాము సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదని, అమెరికా ప్రజల ప్రయోజనాలు, భద్రతకే తమకు ముఖ్యమని జొబైడెన్ వెల్లడించారు. అమెరికా గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేయగా.. అది వాతావరణ పరిశోధన కోసమే ప్రయోగించామని చైనా తెలియజేయడం గమనార్హం.

అమెరికా

అట్లాంటిక్ మహా సముద్రంలో బెలూన్‌ను అమెరికా కూల్చివేసింది

అది గూఢచర్య బెలూన్‌ అమెరికా నమ్మింది. దీంతో యుద్ధ విమానాన్ని పంపించి అట్లాంటిక్‌ మహా సముద్రంలో బెలూన్‌ను కూల్చివేసింది. అయితే కూలిన ప్రదేశంలో సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించినట్లు యూఎస్‌ తెలిపింది. ఈ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోపక్క.. ఫిబ్రవరి 4వ తేదీన తొలి బెలూన్‌ కూల్చిన తర్వాత అమెరికా వైమానిక దళం మరో మూడు వస్తువులను గాల్లోనే కూల్చేసింది.