Page Loader
మెరుగైన స్టైలింగ్ తో మార్కెట్లోకి వచ్చిన 2024 మెర్సిడెస్-బెంజ్ GLC కూపే
255hp ఉత్పత్తి చేసే హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది

మెరుగైన స్టైలింగ్ తో మార్కెట్లోకి వచ్చిన 2024 మెర్సిడెస్-బెంజ్ GLC కూపే

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 15, 2023
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన GLC కూపే 2024 వెర్షన్‌ను ప్రపంచ మార్కెట్లలో ప్రకటించింది. ఇది భారతదేశానికి త్వరలోనే వస్తుంది. ప్రీమియం వాహనం డిజైన్‌తో టెక్-ఆధారిత సౌకర్యాలతో ఉన్న సంపన్నమైన క్యాబిన్‌, గరిష్టంగా 255hp శక్తిని ఉత్పత్తి చేసే తేలికపాటి-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది. మెర్సిడెస్-బెంజ్ GLC కూపే 2024 వెర్షన్ దాని ముందున్న దానితో పోల్చితే మరిన్ని ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. దీనిలో ఇప్పుడు స్టాండర్డ్‌గా AMG లైన్ ప్యాకేజీ ఉంది. ఈ కారు పూర్తిగా నిర్మించబడిన యూనిట్ (CBU) మార్గం ద్వారా భారతదేశానికి చేరుకునే అవకాశం ఉంది. లగ్జరీ కార్ సెగ్మెంట్లో పోటీ ఇప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది.

కార్

2024 మెర్సిడెస్-బెంజ్ GLC సరికొత్త కనెక్టివిటీ ఆప్షన్స్ సపోర్ట్ తో వస్తుంది

2024 మెర్సిడెస్-బెంజ్ GLC కూపే 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో 2.0-లీటర్, టర్బోచార్జ్డ్, నాలుగు-సిలిండర్ ఇంజన్‌తో నడుస్తుంది. లోపల పనోరమిక్ సన్‌రూఫ్, హీటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, బర్మెస్టర్ 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఇది సరికొత్త కనెక్టివిటీ ఆప్షన్స్ సపోర్ట్ తో పోర్ట్రెయిట్-ఓరియెంటెడ్ 11.9-అంగుళాల MBUX టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ప్రయాణీకుల భద్రత కోసం 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, హిల్-డీసెంట్ కంట్రోల్, ఒకటి కంటే ఎక్కువ ఎయిర్ బ్యాగులు ఉంటాయి. 2024 మెర్సిడెస్-బెంజ్ GLC కూపే USలో దాదాపు $60,000 (దాదాపు రూ. 49.4 లక్షలు) ప్రారంభ ధర ఉండచ్చు. ఇది ఈ ఏడాది చివరి నాటికి డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది.