సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో అస్తవ్యస్తంగా మారిన స్టార్టప్ వ్యవస్థ
శాంటా క్లారా, కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) మూలధనాన్ని సమీకరించడంలో విఫలమై కుప్పకూలింది. దాని ఆస్తులను US ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) స్వాధీనం చేసుకుంది. టెక్ లెండర్ షేర్లు గురువారం 60% పడిపోయాయి. FDIC US ప్రభుత్వంకు చెందిన స్వతంత్ర సంస్థ. ఇది ఆర్థిక సంస్థలను పర్యవేక్షించి బ్యాంకు డిపాజిట్లను బీమా చేస్తుంది. ఇది SVB ఆస్తులను లిక్విడేట్ చేసి దాని డిపాజిటర్లు, రుణదాతలకు సేకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. బీమా చేసిన డిపాజిటర్లందరూ సోమవారం ఉదయం వరకు డిపాజిట్లను యాక్సెస్ చేయగలరని ఏజెన్సీ పేర్కొంది. చేయని డిపాజిటర్లు వచ్చే వారం నాటికి "అడ్వాన్స్ డివిడెండ్" అందుకుంటారు.
SVB పతనం భారతదేశంలోని పెట్టుబడిదారులపై ప్రభావం చూపించింది
ఇది పీటర్ థీల్ ఫౌండర్స్ ఫండ్‌తో సహా వెంచర్ క్యాపిటల్ సంస్థల భయాలను పెంచింది. గత ఏడాది US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. రేట్లు పెంచిన తర్వాత, ఆస్తుల విలువ పడిపోవడంతో బ్యాంకులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. టెక్ స్టాక్స్ విలువ తీవ్రంగా దెబ్బతింది, నిధులను సేకరించడం కష్టమైంది. అలా చివరికి, డిపాజిటర్లకు చెల్లించడంలో SVB విఫలమైంది. SVB పతనం భారతదేశంలోని పెట్టుబడిదారులపై ప్రభావం చూపించింది. వారిలో చాలా మంది ఇప్పటికే డిపాజిట్లను ఉపసంహరించుకున్నారు. ఇక్కడ, ప్రారంభ దశ సాఫ్ట్‌వేర్ (SaaS) స్టార్టప్‌లు ఇప్పుడు డబ్బు కోసం మెర్క్యురీ, బ్రెక్స్ వంటి రుణదాతల వైపు మొగ్గు చూపుతున్నాయి.