Page Loader
టెక్సాస్‌ షాపింగ్ మాల్‌లో కాల్పులు; ఒకరు మృతి
టెక్సాస్‌లోని సీలో విస్టా మాల్‌లో దుండగుల కాల్పులు

టెక్సాస్‌ షాపింగ్ మాల్‌లో కాల్పులు; ఒకరు మృతి

వ్రాసిన వారు Stalin
Feb 16, 2023
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెక్సాస్‌లోని సీలో విస్టా మాల్‌లో బుధవారం సాయంత్రం దుండగులు తుపాకీతో రెచ్చిపోయాడు. నలుగురిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడ్డ వారిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మాల్‌లోనే మరో నిందితుడు ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని గురించి పోలీసులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

అమెరికా

2019లో వాల్‌మార్ట్‌లో జరిగిన కాల్పుల్లో 23మంది మృతి

సీలో విస్టా మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌తో పాటు డిల్లార్డ్స్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంకా పరిస్థితి సద్దుమణగలేదని, ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని కస్టమర్లను పోలీసులు హెచ్చరించారు. వాల్‌మార్ట్‌కు ఆనుకొని సీలో విస్టా మాల్‌ ఉంది. వాల్‌మార్ట్‌లో 2019లో జరిగిన సామూహిక కాల్పుల్లో 23మంది మరణించారు. దాదాపు రెండు డజన్ల మంది గాయపడ్డారు. ఇటీవల కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీ, అయోవా రాష్ట్రాల్లో జరిగిన కాల్పుల్లో దాదాపు 20మంది మృతి చెందారు.