
అమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తుపాకీ గర్జనలతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే మరో మూడు ప్రాంతాల్లో తుపాకుల మోత మోగింది.
కాలిఫోర్నియాతో పాటు అయోవా రాష్ట్రాల్లో సోమవారం జరిగిన మూడు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు సహా తొమ్మిది మంది చనిపోయారు. ఈ మూడు సంఘటనలకు సంబంధించిన అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
చైనీస్ న్యూ ఇయర్ డ్యాన్స్ ఈవెంట్‌లో జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య 11కు చేరింది. దీంతో మూడు రోజుల్లో అమెరికాలో తుపాకీ కాల్పులకు బలైన వారకి సంఖ్య 20కి చేరుకుంది.
అమెరికా
కాలిఫోర్నియాలో ఏడుగురు, డెస్ మోయిన్స్ ఇద్దరు విద్యార్థులు బలి
సోమవారం జరిగిన మూడు సంఘటనల్లో రెండు ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలోని పొలాల్లో చోటుచేసుకున్నాయి. ఒకటి అయోవాలోని డెస్ మోయిన్స్‌లోని పాఠశాలలో జరిగింది.
హాఫ్ మూన్ బేలోని మష్రూమ్ ఫామ్ తోపాటు రైస్ ట్రక్కింగ్-సోయిల్ ఫామ్‌లో జరిగిన దాడుల్లో ఏడుగురు కూలీలు మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
డెస్ మోయిన్స్‌లోని స్టార్ట్స్ రైట్ హియర్ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించారు.
మాంటెరీ పార్క్‌లో కాల్పులు జరిపిన 72ఏళ్ల వ్యక్తి భారీ మందుగుండు సామగ్రి ఉన్న తుపాకీతో అల్హంబ్రా నగరంలోని మరొక నృత్య వేదికకు వెళ్లగా, అక్కడ ప్రజలు అతని నుంచి తుపాకీని లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని వెంబడించగా, మరొక తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.