నేడు కోర్టుకు హాజరుకానున్న ట్రంప్; న్యూయార్క్‌లో హైటెన్షన్
'హష్ మనీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ట్రంప్ కోర్టుకు హాజరయ్యేందుకు సోమవారమే తన ప్రైవేట్ విమానంలో న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు. ఒకప్పటి పాపులర్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనైతికంగా 'హష్ మనీ' రూపంలో నగదు చెల్లింపులు జరిగినట్లు ట్రంప్‌పై విచారణ జరుగుతోంది.
న్యూయార్క్‌లో రిపబ్లికన్ల నిరసనలు
ట్రంప్ ఎదుర్కొంటున్న అనేక విచారణలలో న్యూయార్క్ కేసు ఒకటి. 'హష్ మనీ' కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కావడం గమనార్హం. ట్రంప్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో న్యూయార్క్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ట్రంప్‌పై విచారణను నిరసిస్తూ రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. భద్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా క్యాపిటల్ హిల్‌పై జనవరి 6 నాటి ఘటన జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, వైట్, కాలర్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్, మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్ టాడ్ బ్లాంచేతో ట్రంప్ లాయర్లతో కలిసి కేసు విచారణ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, రేడియో కవరేజీని అనుమతించవద్దని కోరారు.