Page Loader
స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి?
స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి?

స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి?

వ్రాసిన వారు Stalin
Mar 31, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్మీ డేనియల్స్ ఒకప్పటి పాపులర్ పోర్న్ స్టార్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమెకు రహస్య సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో స్టార్మీ డేనియల్స్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు స్టార్మీ-ట్రంప్ వ్వవహారం ఏంటి? ఇద్దరు శారీరకంగా ఎక్కడ కలుసుకున్నారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి చూద్దాంం. జూలై 2006లో ఒక ఛారిటీ గోల్ఫ్ టోర్నమెంట్‌లో తాను డొనాల్డ్ ట్రంప్‌ను కలిసినట్లు డేనియల్స్ మీడియా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆ సమయంలో డేనియల్స్ వయస్సు 27 కాగా, ట్రంప్ వయస్సు 60ఏళ్లు. కాలిఫోర్నియా-నెవాడా మధ్య ఉన్న రిసార్ట్ ప్రాంతమైన లేక్ తాహోలోని తన హోటల్ గదిలో తాను ట్రంప్ ఒకసారి సెక్స్‌లో పాల్గొన్నామని ఆమె చెప్పారు.

ట్రంప్

'హష్ మనీ' రూపంలో డేనియల్స్ 1,30,000 డాలర్ల చెల్లింపు

గోల్ఫ్ టోర్నమెంట్‌ కార్యక్రమానికి ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనతో లేదని డేనియల్స్ పేర్కొన్నారు. అయితే తనతో ట్రంప్ సెక్స్‌లో పాల్గొన్న విషయాన్ని రహస్యంగా ఉంచాలని, ట్రంప్ తరఫు న్యాయవాది మైఖేల్ కోహెన్ చెప్పినట్లు డేనియల్స్ గుర్తు చేశారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ ఈ వ్యవహారం గురించి తాను మౌనంగా ఉండటానికి 1,30,000 డాలర్లను "హష్ మనీ" రూపంలో తనకు చెల్లించినట్లు డేనియల్స్ వెల్లడించారు. తన కుటుంబ భద్రతపై ఆందోళన ఉన్నందునే ఈ డీల్‌కు ఒప్పుకున్నట్లు డేనియల్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ట్రంప్

డేనియల్స్‌ను బెదిరించిన ట్రంప్‌ లాయర్ కోహెన్‌

2018లో 'టచ్ ఇన్' న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌-డేనియల్స్ మధ్య ఉన్న సంబంధం బయటకు వచ్చింది. 60నిమిషాల ఎపిసోడ్ ప్రసారం కావడానికి ముందు డేనియల్స్ పై కోహెన్‌తో సంబంధం ఉన్న షెల్ కంపెనీ డేనియల్స్‌పై 20మిలియన్ డాలర్ల దావా వేస్తానని బెదిరించింది. ఈ వ్యవహారంలో నాన్-డిస్క్‌లోజర్ డీల్ (ఎన్‌డీఏ)ను డేనియల్స్‌ ఉల్లంఘించారని షెల్ కంపెనీ హెచ్చరించింది. ఈ దావా నేపథ్యంలో తనను తాను రక్షించుకోవడం కోసం ఏపిసోడ్‌ను ప్రసారం చేయొద్దని 'టచ్ ఇన్' న్యూస్‌ను డేనియల్స్‌ వేడుకున్నారు. అంతేకాదు, నాన్-డిస్క్‌లోజర్ డీల్‌కు వ్యతిరేకంగా డేనియల్స్‌ కోర్టుకు వెళ్లడంతో ఇది అప్పట్లో ఇది సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధం కావడంతో ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.