Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్
'హష్ మనీ' కేసులో ఆరోపణలను ఎందుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత 'ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్' వేదికగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ కోర్టు జడ్జిపై సంచలన కామెంట్స్ చేశారు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జువాన్ మెర్చన్‌ను తనను ద్వేషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును 'విచ్ హంట్ కేసు' ట్రంప్ అభివర్ణించారు. న్యూయార్క్‌లో తాను న్యాయమైన విచారణను పొందలేనని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పోర్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపులపై క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ట్రంప్ లొంగిపోయాక అతనికి సంకెళ్లు వేయరు: న్యాయవాది
అభియోగపత్రం గోప్యంగా ఉన్నందున ట్రంప్‌పై ఆరోపణలు ఇంకా తెలియరాలేదు. జ్యూరీ తనపై అభియోగాలు మోపాలని నిర్ణయించినట్లు వార్త రావడంతో ట్రంప్ న్యూయార్క్‌లోని అధికారులకు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అతను ఫ్లోరిడాలోని తన నివాసమైన మార్-ఎ-లాగోలో ఉన్నారు. సోమవారం న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. ట్రంప్ న్యాయవాది జో టాకోపినా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులకు ట్రంప్ లొంగిపోయినప్పుడు అతనికి బేడీలో వేయరని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం న్యూయార్క్‌లో కోర్టుకు హాజరు అయ్యేటప్పుడు ఆయనకు సంకెళ్లు వేయరని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. ట్రంప్ విచారణ ద్వారా ప్రాసిక్యూటర్లు విపరీతమైన పబ్లిసిటీని పొందుతారని చెప్పారు. తాము కోర్టుకు హాజరైన నిర్దోషులుగా బయటకు వస్తామని పేర్కొన్నారు.