2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి వక్తి వివేక్ రామస్వామి
భారతీయ సంతతికి చెందిన మల్టీ-మిలియనీర్ బయోటెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి (37) 2024 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించారు. ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాపై దేశం ఆధారపడకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఇది కేవలం పోల్ క్యాంపెయిన్ మాత్రమే కాదని, కొత్త అమెరికా కలను సృష్టించే సాంస్కృతిక ఉద్యమం అని ఆయన అన్నారు. తాను అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
డొనాల్డ్‌ట్రంప్, హేలీతో తలపడనున్న రామస్వామి
ఇప్పటికే మరో భారత సంతతికి చెందిన వ్యక్తి హేలీ రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ పోరులో నిలుస్తున్నట్లు ప్రకటించారు. తాజా అదే పార్టీ నుంచి వివేక్ రామస్వామి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం గమనార్హం. పార్టీ ప్రెసిడెన్షియల్ పోరులో రామస్వామి, హేలీలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌తో తలపడనున్నారు. దేశంలో ఆదర్శాలను పునరుద్ధరించడానికి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నానని చెప్పడానికి గర్వపడుతున్నట్లు రామస్వామి ప్రకటించారు. రామస్వామి ఒహియోలోని సిన్సినాటిలో జన్మించారు. అతని తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్. అతని తల్లి మానసిక వైద్యురాలు. అతని తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వచ్చారు.