Page Loader
బి ఎం డబ్ల్యూ i5 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
i3, i7 మోడళ్లకు సమానమైన CLAR ప్లాట్‌ఫారమ్ ఉంటుంది

బి ఎం డబ్ల్యూ i5 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 30, 2023
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ సెడాన్ జీరో-ఎమిషన్ డెరివేటివ్‌పై పని చేస్తోంది, దీనిని i5 అంటారు. బి ఎం డబ్ల్యూ ఎక్కువగా దాని సిరీస్ లో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తుంది ఈ 5 సిరీస్ అందులో భాగమే. i3, i7 మోడళ్లకు సమానమైన CLAR ప్లాట్‌ఫారమ్ ద్వారా i5 సెడాన్ రూపొందుతుంది. ఇది వచ్చే ఏడాది భారతదేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది. బి ఎం డబ్ల్యూ i5 బ్యాటరీ ప్యాక్, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కనెక్ట్ అయిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. పవర్ ఫిగర్‌లు, రేంజ్ వివరాలు తయారీసంస్థ ఇంకా వెల్లడించలేదు కానీ సెడాన్ ఒక్కో ఛార్జీకి 400కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

కార్

i5 ధర, ఇతర వివరాలు లాంచ్ సమయంలో ప్రకటించనున్న బి ఎం డబ్ల్యూ

బి ఎం డబ్ల్యూ i5 లోపల హెడ్-అప్ డిస్‌ప్లే, USB ఛార్జర్‌లు, క్రూయిజ్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌తో ఉన్న 5-సీటర్ క్యాబిన్‌ ఉంటాయి. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, iDrive 8.5 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం ADAS సూట్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక కెమెరా, ABS, EBD ఉంటాయి. బి ఎం డబ్ల్యూ i5 సెడాన్ లభ్యత, ధరల సమాచారాన్ని దాని లాంచ్ సమయంలో సంస్థ ప్రకటిస్తుంది. అయితే, USలో, వాహనం దాదాపు $62,000 (దాదాపు రూ. 51 లక్షలు) ధర ఉండచ్చని అంచనా.