NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఎయిర్ న్యూజిలాండ్ ప్లేన్: 16గంటలు గాల్లోనే ప్రయాణం చేసి వెనక్కి వచ్చేసిన ఫ్లైట్
    తదుపరి వార్తా కథనం
    ఎయిర్ న్యూజిలాండ్ ప్లేన్: 16గంటలు గాల్లోనే ప్రయాణం చేసి వెనక్కి వచ్చేసిన ఫ్లైట్
    16గంటలు గాల్లోనే ప్రయాణం చేసి గమ్యం చేరుకోకుండా వెనక్కి వచ్చేసిన ఫ్లైట్

    ఎయిర్ న్యూజిలాండ్ ప్లేన్: 16గంటలు గాల్లోనే ప్రయాణం చేసి వెనక్కి వచ్చేసిన ఫ్లైట్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 17, 2023
    03:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎయిర్ న్యూజిలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ఫ్లైట్ NZ2, న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుండి అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కి బయలు దేరింది.

    న్యూయార్క్ లో జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో 1వ టర్మినల్ లో దిగాల్సింది. కానీ అనుకోకుండా జాన్ ఎఫ్ కెన్నెడీ విమాశ్రయం టర్మినల్ 1లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

    ఈ పరిస్థితి చాలా సేపటివరకు అలాగే ఉండడంతో ఆక్లాండ్ నుండి బయలు దేరిన విమానం తిరిగి యూటర్న్ తీసుకుని ఆక్లాండ్ వైపే బయలుదేరింది. అంటే మొత్తం 16గంటల పాటు విమానం గాల్లోనే ఉంది.

    14000కిలోమీటర్లు ప్రయాణం చేసిందన్నమాట. ఈ మేరకు ఎయిర్ న్యూజిలాండ్ అధికారులు తెలియజేసారు. పసిఫిక్ సముద్రం మీదుగా ప్రయాణించిన విమానం, రిటర్న్ వచ్చేసింది.

    అంతర్జాతీయం

    వేరే టర్మినల్ లో దిగకపోవడానికి కారణాలు

    వెనక్కి తిరిగి వెళ్ళకుండా అమెరికాలోని ఇతర ఎయిర్ పోర్ట్ లో విమానాన్ని దించకపోవడానికి కారణాన్ని వివరిస్తూ, ఒకవేళ విమానాన్ని వేరే ఎయిర్ పోర్ట్ లో దించితే, కొన్నిరోజుల పాటు ఆ విమానం అక్కడే ఉండాల్సి వచ్చేది.

    దానివల్ల వేరే ప్రయాణీకుల ప్రయాణాలకు ఇబ్బంది కలిగేదని ఎయిర్ న్యూజిలాండ్ సంస్థ అధికారులు వెల్లడించారు. శుక్రవారం మద్యాహ్నం ఈ విమానం ఆక్లాండ్ లో దిగింది. ఇక్కడ నుండి ప్రయాణీకులను అమెరికాలోని ఇతర ఎయిర్ పోర్టులకు వేరే విమానాల పంపిస్తున్నామని వాళ్ళు వెల్లడి చేసారు.

    సరిగ్గా నెలక్రితమే ఎమిరేట్స్ కి చెందిన విమానం, దుబాయ్ నుండి ఆక్లాండ్ బయలుదేరింది. కానీ ఆక్లాండ్ లో వరదల వల్ల 13గంటల ప్రయాణం తర్వాత ఎక్కడి నుండి ఎగిరిందో అక్కడికే చేరుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ప్రపంచం

    డ్రాగా ముగిసిన జర్మన్-ప్యారిస్ మ్యాచ్ ఫుట్ బాల్
    అలా ప్రవర్తించడం నాకే నచ్చలేదు : మెస్సీ ఫుట్ బాల్
    క్లబ్ మేనేజర్‌గా సీన్ డైచే, ధ్రువీకరించిన ఎవర్టన్ ఫుట్ బాల్
    జొకోవిచ్, నాదల్ సాధించిన రికార్డులివే టెన్నిస్

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    అమెరికాను వణికిస్తున్న భారీ వర్షాలు.. కాలిఫోర్నియాను వీడుతున్న ప్రజలు అంతర్జాతీయం
    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు విమానం
    సుడిగాలుల బీభత్సం: అమెరికాలో ఆరుగురు, జార్జియాలో ఒకరు దుర్మరణం జార్జియా
    అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025