Loading...
Parvathy Thiruvothu: భాష విషయంలో రాజీపడను.. సినిమాలు కూడా వదులుకున్నా: పార్వతీ తిరువోతు
భాష విషయంలో రాజీపడను.. సినిమాలు కూడా వదులుకున్నా: పార్వతీ తిరువోతు

Parvathy Thiruvothu: భాష విషయంలో రాజీపడను.. సినిమాలు కూడా వదులుకున్నా: పార్వతీ తిరువోతు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాది భాషలు, యాసలను పలికే విషయంలో నటులు ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై నటి పార్వతి తిరువోతు స్పందించారు. ఇతర భాషల్లో నటించేటప్పుడు యాస విషయంలో సహజంగానే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె పేర్కొన్నారు. ఒక భాషను నేర్చుకోవడం, అందులో సహజంగా మాట్లాడటం ఒక్కరోజులో సాధ్యమయ్యే విషయం కాదని అభిప్రాయపడ్డారు. 'ప్రేక్షకులకు సహజమైన నటన అవసరమని నేను నమ్ముతాను. ఇప్పటి వరకు నేను నచ్చిన సినిమాలను మాత్రమే చేశా. కొత్త భాషలను నేర్చుకోవడం నాకు ఆసక్తి. అందుకే వేరే భాషలో అవకాశం వచ్చినప్పుడు అంగీకరిస్తాను. ఆ భాష కోసం శిక్షణ తీసుకోవడానికి కూడా వెనకాడను.

వివరాలు

వరుస చిత్రాలతో అలరిస్తున్న పార్వతి

అయితే ఒకవేళ నేను ఆ పాత్రను సరిగ్గా పోషించలేనని భావిస్తే.. వెంటనే నో చెప్పేస్తా. నా స్థానంలో డైలాగ్‌లు బాగా చెప్పే డబ్బింగ్‌ కళాకారిణిని తీసుకున్నా సంతోషిస్తా. ఈ కారణంగా సినిమాలు వదులుకున్న సందర్భాలూ ఉన్నాయని పార్వతి తిరువోతు తెలిపారు.

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ.. జయాపజయాలతో సంబంధం లేకుండా పార్వతి తిరువోతు వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు.

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవల పార్వతి తిరువోతు నటించిన మలయాళం థ్రిల్లర్‌ 'ప్రథమ దృష్ట్య కుట్టక్కర్‌' (Pradhama Drishtya Kuttakkar) విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందింది.

ADVERTISEMENT