Loading...
Hanuman Ansh: రూ.400 కోట్ల వసూళ్ల మూవీ తెలుగులోకి.. 'హనుమాన్‌ అంశ్‌' రిలీజ్‌ డేట్ ఇదే
రూ.400 కోట్ల వసూళ్ల మూవీ తెలుగులోకి.. 'హనుమాన్‌ అంశ్‌' రిలీజ్‌ డేట్ ఇదే

Hanuman Ansh: రూ.400 కోట్ల వసూళ్ల మూవీ తెలుగులోకి.. 'హనుమాన్‌ అంశ్‌' రిలీజ్‌ డేట్ ఇదే

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ పరిశ్రమలో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన చిత్రం 'హనుమాన్‌ అంశ్‌'. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్‌ విడుదల కానుంది. నిజానికి 'హనుమాన్‌ అంశ్‌'ను తొలుత సెప్టెంబర్‌ 18న తెలుగులో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఈ సినిమా తెలుగు విడుదల బాధ్యతలను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తీసుకున్నట్లు కూడా ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో తెలుగు విడుదలను వాయిదా వేశారు.

వివరాలు

నీమ్‌ కరోలి బాబా జీవితం ఆధారంగా..

తాజాగా 'హనుమాన్‌ అంశ్‌' తెలుగు విడుదల తేదీని ఖరారు చేశారు.

అక్టోబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ హోంబలే ఫిల్మ్స్‌ కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది.

1900-1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్‌ భక్తుడు నీమ్‌ కరోలి బాబా (మహరాజ్‌జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా 'హనుమాన్‌ అంశ్‌' తెరకెక్కింది. ఈ చిత్రానికి విశాల్‌ చతుర్వేది దర్శకత్వం వహించారు.

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో ఈ చిత్రం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

అదే రోజు మరో రెండు సినిమాలు

ఇక అక్టోబర్‌ 9న తెలుగులో 'హనుమాన్‌ అంశ్‌'తో పాటు మరో రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' (Adarsha Kutumbam) చిత్రం అదే రోజున విడుదల కానుంది.

అలాగే శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం 'కామ్రేడ్‌ కళ్యాణ్‌' (Comrade Kalyan) కూడా అక్టోబర్‌ 9నే థియేటర్లలోకి రానుంది.

దీంతో ఆ రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు మూడు సినిమాలు రాబోతున్నాయి.

ADVERTISEMENT