టాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్
US ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (J&J) తన టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతాయని పేర్కొంటూ ఏళ్ల తరబడి ఉన్న పిటిషన్స్ పరిష్కరించడానికి $8.9 బిలియన్ల పరిష్కారాన్ని ప్రతిపాదించింది. న్యూజెర్సీకి చెందిన కంపెనీ ప్రతిపాదిత పరిష్కారానికి దివాలా కోర్టు ఆమోదం పొందినట్లైతే, $8.9 బిలియన్ల చెల్లింపు అనేది యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్ద సెటిల్‌మెంట్‌లలో ఒకటి అవుతుంది. అండాశయ క్యాన్సర్‌కు కారణమైన ఆస్బెస్టాస్ జాడలను ఈ టాల్కమ్ పౌడర్‌పై J&J వేలాది పిటిషన్స్ ఎదుర్కొంటోంది. సంస్థ తప్పు చేసినట్లు ఎప్పుడూ అంగీకరించలేదు కానీ మే 2020లో యునైటెడ్ స్టేట్స్, కెనడాలో టాల్క్ ఆధారిత బేబీ పౌడర్‌ను అమ్మడం ఆపేసింది.
J&J గతంలో $2 బిలియన్ల పరిష్కారాన్ని ప్రతిపాదించింది
ఈ క్లెయిమ్‌లు శాస్త్రీయ యోగ్యత లేనివని కంపెనీ నమ్ముతుందని J&J వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ హాస్ ఒక ప్రకటనలో తెలిపారు. J&J క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన J&J అనుబంధ సంస్థ LTL మేనేజ్‌మెంట్ LLC ద్వారా 25 ఏళ్లలో పదివేల మంది క్లెయిందారులకు $8.9 బిలియన్ చెల్లిస్తుందని J&J తెలిపింది. J&J గతంలో సౌందర్య టాల్క్ పౌడర్ స్త్రీ జననేంద్రియ క్యాన్సర్‌లకు కారణమవుతుందనే ఆరోపణలకు ప్రతిస్పందనగా $2 బిలియన్ల పరిష్కారాన్ని ప్రతిపాదించింది. కొత్తగా ప్రతిపాదించిన పరిష్కారం తప్పును అంగీకరించడం కాదని తమ టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు సురక్షితమైనవని అంటూనే, ఈ విషయాన్ని వీలైనంత త్వరగా, సమర్ధవంతంగా పరిష్కరించడం కంపెనీకి, అన్ని వాటాదారుల ప్రయోజనాలకు మేలు చేస్తుందని కంపెనీ పేర్కొంది.