యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ: వార్తలు

తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ US-ఆధారిత విభాగం ఆంజినా, అధిక రక్తపోటు కొన్ని రకాల గుండె చికిత్సలకు ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను వెనక్కి రప్పిస్తుంది.

11 Feb 2023

చైనా

'స్పై బెలూన్' ఎపిసోడ్: ఆరు చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అమెరికా

చైనా 'గూఢచారి' బెలూన్ వ్యవహారాన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'స్పై బెలూన్‌'‌ను కూల్చేసిన అగ్రరాజ్యం, తాజాగా ఆ దేశ కంపెనీలకు షాకిచ్చింది.

H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం

H-1B వీసాపై అమెరికా కొత్త ప్లాన్ అమలు చేస్తుంది దీనితో H-1B, L1 వీసాలపై వేలాది మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో వేలాది మంది భారతీయ టెక్కీలకు ప్రయోజనం చేకూరుతుంది. పైలట్ ప్రాతిపదికన "దేశీయ వీసా రీవాలిడేషన్" కేటగిరీలు పెట్టి తర్వాత కొన్ని సంవత్సరాలలో దానిని పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.

10 Feb 2023

భూకంపం

టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు

సోమవారం భారీ భూకంపం కారణంగా సిరియా, టర్కీలో 21,000 మందికి పైగా మరణించారు. విరామం లేకుండా 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కానీ మంచు, వర్షం కారణంగా వారి పనికి ఆటంకం కలుగుతుంది.

10 Feb 2023

మెటా

ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్-ఫోకస్డ్ టిప్పింగ్ ఫీచర్ యాక్సెస్‌ను విస్తరిస్తున్న మెటా

గత నవంబర్‌లో, క్రియేటర్‌లు డబ్బు సంపాదించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'గిఫ్ట్‌లను' మెటా పరిచయం చేసింది. ఇప్పుడు మరింత మంది క్రియేటర్‌లకు ఈ ఫీచర్ యాక్సెస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

పావోలా హార్డ్ తో ప్రేమలో పడిన బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒరాకిల్ మాజీ సిఈఓ మార్క్ హార్డ్ మాజీ భార్య పౌలా హర్డ్‌తో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో కనిపించారు.

హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న 2024 టయోటా గ్రాండ్ హైలాండర్

జపాన్ తయారీ సంస్థ టయోటా గ్లోబల్ మార్కెట్ లో గ్రాండ్ హైలాండర్ 2024 వెర్షన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 11న జరగబోయే 2023 చికాగో ఆటో షోలో దీనిని ప్రదర్శిస్తారు.

09 Feb 2023

రష్యా

రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా

రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనుగోలు చేయడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్‌పై ఆంక్షలు విధించే ఉద్దేశం తమకు లేదని అమెరికాకు చెందిన ఐరోపా, యురేషియా వ్యవహారాల సహాయ కార్యదర్శి కరెన్ డాన్‌ఫ్రైడ్ తెలిపారు.

08 Feb 2023

చైనా

'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా

ఇటీవల అమెరికా గుర్తించిన చైనా గూఢచారి బెలూన్లపై 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన విషయాలను బయపెట్టటింది. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలే లక్ష్యంగా గూఢచారి బెలూన్ల ద్వారా చైనా రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొంది.

కిమ్‌కు ఏమైంది? 40రోజులుగా కనపడని ఉత్తర కొరియా అధ్యక్షుడు!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై మళ్లీ ఉహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన దాదాపు 40రోజులుగా బహిరంగంగా కనిపంచకపోవడంతో అనేక అనుమానాలు రేకేత్తుతున్నాయి.

07 Feb 2023

చైనా

'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా

అమెరికా మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'గూఢచారి' బెలూన్‌‌ను శనివారం అగ్రరాజ్య బలగాలు కూల్చేశాయి. అయితే ఆ బెలూన్ శిథిలాలను తిరిగి చైనాకు అప్పగించేది లేదని తాజాగా అమెరికా ప్రకటించింది.

04 Feb 2023

చైనా

మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను గుర్తించిన అమెరికా, డ్రాగన్ వ్యూహం ఏంటి?

మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను అమెరికా గుర్తించింది. లాటిన్ అమెరికా గగన తలంలో ఈ బెలూన్ కనిపించిందని పెంటగాన్ తెలిపింది.

03 Feb 2023

చైనా

అమెరికా అణు ప్రయోగ కేంద్రంపై చైనా 'గూఢచారి' బెలూన్‌, పెంటగాన్ అలర్ట్

అమెరికాలో చైనా భారీ సాహసానికి ఒడిగట్టింది. మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగన తలంలోకి 'గూఢచారి' బెలూన్‌‌ను పంపి చైనా అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయాన్ని అమెరికా సీనియర్ రక్షణ అధికారి ఒకరు నిర్ధారించారు.

ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు!

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులో నిఘా కోసం అమెరికా నుంచి అత్యాధునిక 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసే అంశంపై భారత్ కొంతకాలంగా అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతోంది.

ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ క్రమంలో రష్యా సేనలను ధీటుగా ఎదుర్కోవడానికి, ఉక్రెయిన్ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఆధునిక ట్యాంకులు, యుద్ధ విమానాలను సాయం చేయాలని మిత్ర దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.

28 Jan 2023

చైనా

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విమానాల విన్యాసాలు

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక కదలికలతో చైనా మండిపడుతోంది. రెండు వారాల క్రితం దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా అతిపెద్ద యుద్ధనౌక 'నిమిట్జ్‌' వచ్చింది. తాజాగా డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లను దక్షిణ చైనా సముద్రంలో ఆగ్రరాజ్యం ప్రదర్శించింది. దీంతో చైనా అగ్గిలం మీద గుగ్గిలం అవుతోంది.

అమెరికా దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ సీనియర్ లీడర్ సహా 11మంది హతం

ఉత్తర సోమాలియా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఐసీస్ సీనియర్ లీడర్‌తో పాటు మరో 10మంది మృతి చెందారు.

25 Jan 2023

గూగుల్

గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఎనిమిది రాష్ట్రాలు గూగుల్‌పై యాంటీట్రస్ట్ దావాను దాఖలు చేశాయి. కంపెనీ డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.ఈ దావాలో DOJతో చేరిన రాష్ట్రాలలో న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలరాడో, వర్జీనియా ఉన్నాయి.

25 Jan 2023

నాసా

ఎలక్ట్రాన్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రాకెట్ ల్యాబ్

కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్ రాకెట్ ల్యాబ్, తన ఎలక్ట్రాన్ బూస్టర్‌ తొలి ప్రయోగాన్నిఅమెరికా నుండి విజయవంతంగా నిర్వహించింది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం!

రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడుతోంది. పుతిన్ సేనలను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అధునాతన భారీ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికా, జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయం రష్యాతో యుద్ధాన్ని పునర్మిస్తుందని ఉక్రెయిన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

బీబీసీ డాక్యుమెంటరీ: 'భారత్- అమెరికా భాగస్వామ్య విలువలు గురించి మాత్రమే తెలుసు'

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ విషయం ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే దీనిపై యూకే స్పందించగా, సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించారు.

ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం

ఫిబ్రవరి 5 న పౌర్ణమి వస్తుంది. దీనికి ఒక ఆసక్తికరమైన పేరుంది అదే స్నో మూన్. Earthsky.org ప్రకారం, ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఉండే లియో రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రం అయిన రెగ్యులస్ సమీపంలో ఈ పౌర్ణమి కనిపిస్తుంది.

అమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి

తుపాకీ గర్జనలతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే మరో మూడు ప్రాంతాల్లో తుపాకుల మోత మోగింది.

23 Jan 2023

విమానం

ఉద్యోగులు చేసిన తప్పిదం వల్లే విమానాలు నిలిచిపోయాయి: ఎఫ్ఏఏ

జనవరి 11న అమెరికా వ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోవడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తీవ్ర విమర్శలను ఎందుర్కొంది. ఈ పరిణామంపై విచారణ చేపట్టిన ఎఫ్ఏఏ, ఆరోజు మిమానాలు నిలిచిపోవడానికి గల కారణాలను తాజాగా వెల్లడించింది.

కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో తుపాకీ మోత, 10 మంది మృతి

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌ మాంటెరీ పార్క్‌లో జరిగిన చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీలో ఓ 72 ఏళ్ల వృద్ధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఈ కాల్పుల్లో 10మంది అక్కడిక్కకడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

40వ వార్షికోత్సవం సందర్భంగా Outlander స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసిన Mitsubishi

Mitsubishi తన Outlander మోడల్ 40వ వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్‌ను USలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర $41,340 (సుమారు రూ. 33.47 లక్షలు). ఈ ఆఫ్-రోడర్ నలుపు, బ్రాంజ్ పెయింట్ తో వస్తుంది. దీనికి లోపలా, బయటా 40వ వార్షికోత్సవ బ్యాడ్జ్‌లు ఉంటాయి. ప్రస్తుతానికి బుకింగ్స్ తెరుచుకున్నాయి.

19 Jan 2023

గవర్నర్

అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం

హైదరాబాద్‌లో జన్మించిన కాట్రగడ్డ అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలిగా అరుణ చరిత్ర సృష్టించారు.

18 Jan 2023

వీసాలు

భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా

భారతీయులకు వీసాలను ఎక్కువ సంఖ్యలో, వేగంగా జారీ చేసేందుకు అమెరికా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దౌత్య కార్యాలయాల్లో నియామకాలను రెట్టింపు చేయాలని భావిస్తోంది. అది కూడా భార్య భర్తలను నియమించాలని అమెరికా కృషి చేస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.

మార్టిన్ లూథర్ కింగ్ డే: ఇరువర్గాలు పరస్పరం కాల్పులు, 8మందికి గాయాలు

అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్ పియర్స్‌లో 'మార్టిన్ లూథర్ కింగ్ డే' ఈవెంట్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇరు వర్గాలు మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) గుర్తించింది. ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఐరాస చేర్చింది.

సుడిగాలుల బీభత్సం: అమెరికాలో ఆరుగురు, జార్జియాలో ఒకరు దుర్మరణం

అమెరికాకు ఆగ్నేయం వైపు ఉన్న రాష్ట్రాలు, దేశాల్లో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు సుడిగాలల ధాటికి ఏడుగురు చనిపోయగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వందల ఇళ్లు నేలకొరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

13 Jan 2023

విమానం

NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు బుధవారం అనుకోని సంఘటన ఎదురైంది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (NOTAM) అనే వ్యవస్థ వలన అంతరాయం ఏర్పడి వేలాది విమానాలు ఆగిపోయాయి. అంతరాయం ఫలితంగా 9,700 విమానాలు ఆలస్యం అయ్యాయి, అంతేకాకుండా 2,800 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి.

అమెరికాను వణికిస్తున్న భారీ వర్షాలు.. కాలిఫోర్నియాను వీడుతున్న ప్రజలు

మొన్నటి వరకు మంచుతుపానుతో అల్లాడిపోయిన అమెరికా ప్రజలను ఇప్పుడు భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌తో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో కుండపోత వర్షాలు, బలమైన గాలులతో ప్రజలు వణికిపోతున్నారు.

06 Jan 2023

పరిశోధన

'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా

నాసా పాలపుంతకు సంబంధించిన ఒక చిత్రాన్ని విడుదల చేసింది. నక్షత్ర మండలం లోపల కుడి వైపున కాస్మిక్ దుమ్ము, శిధిలాలతో, నక్షత్రాలతో నిండి ఉన్నా సరే చిత్రంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

05 Jan 2023

ప్రపంచం

మరో 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌

ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 18వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటించారు.

560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష

560 శవాలకు చెందిన అవయవాలను అక్రమంగా విక్రయించిన ఘటన ఆమెరికాలోని కొలోరాడోలో వెలుగుచూసింది. ఈ కేసులో ఓ మహిళకు 20ఏళ్లు, ఆమె తల్లికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది.

04 Jan 2023

చైనా

ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా

చైనాలో కరోనా విరవిహారం చేస్తోంది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి.

04 Jan 2023

దిల్లీ

తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?

ఓ వ్యక్తి పీకల దాకా తాగి.. ఆ మత్తులో తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇది జరిగింది.. బస్సులో కాదు, ట్రైన్‌లో కాదు. అమెరికా నుంచి దిల్లీకి వస్తున్న ఢిల్లీ ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఎయిర్ ఇండియా అధికారులు ధృవీకరించారు.

03 Jan 2023

గూగుల్

మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు

టెక్ సంస్థలు మళ్ళీ వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే USలోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఈసారి కోతలు మరింత ఎక్కువగా ఉండచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం

ఉక్రెయిన్ యుద్ధం, బలమైన డాలర్, ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రూడ్ దిగుమతిదారు చైనా నుండి డిమాండ్ తగ్గడం వలన చమురు ధరలు శుక్రవారం పెరిగాయి.

మునుపటి
తరువాత