గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఎనిమిది రాష్ట్రాలు గూగుల్‌పై యాంటీట్రస్ట్ దావాను దాఖలు చేశాయి. కంపెనీ డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.ఈ దావాలో DOJతో చేరిన రాష్ట్రాలలో న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలరాడో, వర్జీనియా ఉన్నాయి.
ఈ నెల ప్రారంభంలో, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో తన పరిపాలన టెక్ దిగ్గజాల దుర్వినియోగాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని హెచ్చరించారు. గూగుల్ కి వ్యతిరేకంగా DOJ వేసిన దావాతో, మిగిలిన టెక్ కంపెనీలు ఇది ఒక హెచ్చరికగా తీసుకోవచ్చు.
వాషింగ్టన్‌లో గూగుల్ విమర్శకులు డిజిటల్ ప్రపంచంలో గూగుల్ కి ఉన్న శక్తి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కేసు కొంతకాలంగా విచారణలో ఉంది.
గూగుల్
పోటీదారులను తొలగించడానికి ఆధిపత్యాన్ని ఉపయోగిస్తుందనే ఆరోపణ ఎదుర్కొంటున్న గూగుల్
వర్జీనియాలోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఈ 153 పేజీల దావాలో, DOJ గూగుల్ మార్కెట్ సంక్లిష్ట పనితీరు గురించి వివరించింది.
ప్రధాన పోటీదారులను ప్రకటన సాంకేతిక సాధనాల కోసం మార్కెట్‌ను విడిచిపెట్టమని బలవంతం చేయడమే కాకుండా పోటీదారులను మార్కెట్‌లో చేరకుండా అడ్డుపడిందని ఆరోపించింది. పోటీదారులను తొలగించడానికి గూగుల్ తన ఆధిపత్యాన్ని ఉపయోగిస్తోందని ప్రభుత్వం ఆరోపించింది
DOJ వేసిన వ్యాజ్యంలో గూగుల్ ప్రకటనల వ్యాపారాన్ని విడిచిపెట్టాలని కోర్టును కోరింది. కనీసం దాని ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ ఎక్స్ఛేంజ్, ప్రచురణకర్తల కోసం దాని ప్రకటన సర్వర్‌ను నిలిపివేయమని కంపెనీని ఆదేశించాలని కోర్టు కోరుతోంది. అయితే గూగుల్ మాత్రం ఇవన్నీఆధారం లేని ఆరోపణలని తెలిపింది.