Page Loader
అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస
మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి

అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస

వ్రాసిన వారు Stalin
Jan 17, 2023
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) గుర్తించింది. ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఐరాస చేర్చింది. ప్రపంచ ఉగ్రవాదల జాబితాలో మక్కీని గతంలో భారత్ చేసిన ప్రయత్నాన్ని చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా, భారత్ మక్కీపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో భారత్, అమెరికా మరోసారి మక్కీ పేరును భద్రతా మండలిలో ప్రతిపాదించగా.. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఈసారి మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే విషయంలో చైనా అడ్డుకోలేకపోయింది.

మక్కీ

అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఎవరంటే?

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్‌గా మక్కీ ప్రస్తుతం ఉన్నారు. సంస్థ రాజకీయ వ్యవహారాల విభాగానికి ప్రస్తుతం మక్కీ నాయకత్వం వహిస్తున్నారు. లష్కరే తోయిబా చీఫ్, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు స్వయానా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ బావమరిది అవుతాడు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యక్రమాలను ప్రోత్సహిచడం, టెర్రర్ ఫండింగ్, ఉగ్రవాదులను రిక్రూట్ చేయడంతోపాటు వారికి శిక్షణను మక్కీ ఇస్తుంటాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులు, డిసెంబర్ 22, 2000న ఎర్రకోట దాడి, 2008లో నూతన సంవత్సరం రోజున రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపు‌పై దాడి, మే 2018లో ఖాన్‌పోరా (బారాముల్లా) దాడి, జూన్ 2018లో శ్రీనగర్ దాడి, ఆగస్టు 2018లో బండిపోరాలో జరిగిన దాడుల్లో మక్కీ హస్తం ఉంది.