ఉద్యోగులు చేసిన తప్పిదం వల్లే విమానాలు నిలిచిపోయాయి: ఎఫ్ఏఏ
జనవరి 11న అమెరికా వ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోవడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తీవ్ర విమర్శలను ఎందుర్కొంది. ఈ పరిణామంపై విచారణ చేపట్టిన ఎఫ్ఏఏ, ఆరోజు మిమానాలు నిలిచిపోవడానికి గల కారణాలను తాజాగా వెల్లడించింది. నోటీసు టు ఎయిర్ మిషన్స్ (NOTAM) వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు కీలకమైన ఫైల్స్‌ను డిలీట్ చేయడం వల్లే సాంకేతిక సమస్య తలెత్తి అమెరికా వ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోయినట్లు ఎఫ్ఏఏ చెప్పింది. అమెరికాలోని విమాన సర్వీసులు సజావుగా సాగేందుకు అంతర్గతంగా NOTAM నియంత్రిస్తుంది. ఈ అంతరాయం కారణంగా 9,700 విమానాలు ఆలస్యం కాగా, 2,800 కంటే ఎక్కువ విమానాలు రద్దుచేశారు. 9/11 తర్వాత ఈస్థాయిలో వేలాది వాహనాలు నిలిచిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
సైబర్‌టాక్ ఎటాక్ గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు:ఎఫ్ఏఏ
నోటీసు టు ఎయిర్ మిషన్స్‌లో ఉపయోగించే సామాగ్రి మూడు దశాబ్దాల కాలం నాటివని, వాటిని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని ఎఫ్ఏఏ విచారణలో తేలింది. కాంట్రాక్ట్ సిబ్బంది కీలకమైన ఫైల్స్‌ను తొలగించడం వల్ల, సాఫ్ట్‌వేర్ దెబ్బతిని ఈ విపత్కర పరిణామాలకు దారితీసిందని ఎఫ్ఏఏ చెప్పింది. NOTAMలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు లైవ్ డేటాబేస్, బ్యాకప్ సిస్టమ్‌ను అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు ఇచ్చిన నివేదికలో ఎఫ్ఏఏ చెప్పింది. సైబర్‌టాక్ ఎటాక్ గురించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.