Page Loader
అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం
అమెరికాలో మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్‌గా గవర్నర్‌ ప్రమాణం

అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం

వ్రాసిన వారు Stalin
Jan 19, 2023
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో జన్మించిన కాట్రగడ్డ అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలిగా అరుణ చరిత్ర సృష్టించారు. అరుణా మిల్లర్ 2010 నుంచి 2018 వరకు మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో రెండు పర్యాయాలు పనిచేశారు. కాంగ్రెస్‌కు పోటీ చేసి ఓడిపోయారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ ప్రమాణస్వీకారం సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. తాను వచ్చిన నేపథ్యాన్ని, తన పాఠశాల రోజులను తలుచుకున్నారు. ముఖ్యంగా అమెరికాకు వచ్చిన తర్వాత పాఠశాలలో మొదటి రోజు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అరుణా మిల్లర్

ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా తన కెరీర్ ప్రారంభం

1972లో తన 7సంవత్సరాల వయస్సులో అరుణ మిల్లర్ కుటుంబం అమెరికా నుంచి వెలస వెళ్లింది. అరుణ తండ్రి కాంట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎంలో పనిచేసేవారు. ఈయన తల్లిదండ్రులది కృష్ణాజిల్లాలోని పెదపారుపూడి. మెకానికల్ ఇంజనీర్ వెంకటరామారావు 1960లో అమెరికాకు ఉన్నత చదవు కోసం వచ్చారు. చదవు పూర్తయ్యాక తిరిగి భారత్ వచ్చేశారు. 1972లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అరుణ మిల్లర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు అరుణ మిల్లర్. 1990లో డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.