LOADING...
Andhra Pradesh: ఉగాదికి 2.5 లక్షల గృహ ప్రవేశాలు.. 13న అన్నదాత సుఖీభవ నిధులు జమ
13న అన్నదాత సుఖీభవ నిధులు జమ

Andhra Pradesh: ఉగాదికి 2.5 లక్షల గృహ ప్రవేశాలు.. 13న అన్నదాత సుఖీభవ నిధులు జమ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇకపై ముందుగానే ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) తరహాలో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్‌ఏ)' పేరుతో డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2047 నాటికి ఎస్తోనియా, ఇజ్రాయెల్ దేశాల మాదిరిగా ప్రతి వెయ్యిమందికి ఒక స్టార్టప్ ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకంలోని మూడో విడత నిధులను ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ఉగాది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2.50లక్షల గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని తెలిపారు. దివ్యాంగులు,వారికి సహాయపడే వ్యక్తులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.

వివరాలు 

నెలలో 8 రోజులు కలెక్టర్లు క్షేత్రంలోనే..

వ్యవసాయ సీజన్‌ను ముందుగానే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, ఖరీఫ్ పంటలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని సూచించారు. రైతులు ముందుగానే నారుమళ్లను వేయడానికి వీలుగా మే 15 నుంచే కాలువల్లో నీటిని విడుదల చేస్తామని వివరించారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తూ రాబోయే ఏడాదిలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన 15 అంశాలను వివరించారు. వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో ఎవరైనా ఆటలాడితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అది అధికారులు అయినా, సాధారణ ప్రజలు అయినా చట్టం ముందు ఒకటేనని స్పష్టం చేశారు. సంస్కరణల గురించి మాట్లాడటం మాత్రమే సరిపోదని,అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పని చేసినప్పుడే ఫలితాలు వస్తాయని తెలిపారు.

వివరాలు 

నెలలో 8 రోజులు కలెక్టర్లు క్షేత్రంలోనే..

ఇకపై ప్రతి నెలా కలెక్టర్లు 8 రోజులు, విభాగాధిపతులు 6 రోజులు, కార్యదర్శులు 4 రోజులు తప్పనిసరిగా క్షేత్ర పర్యటనలు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని, దానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో డయేరియా కేసులు, రాజమహేంద్రవరంలో కల్తీ పాలు, వేట్లపాలెంలో బాణసంచా పేలుడు ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కొంతమంది స్వార్థపరులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వారిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు విఫలమైనా, ప్రజలు తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

సబ్‌స్టేషన్ యూనిట్‌గా మైక్రోగ్రిడ్స్

'కుటుంబానికో పారిశ్రామికవేత్త' అనే లక్ష్యంతో లక్ష మంది మహిళలను మైక్రో ఆంత్రప్రెన్యూర్స్‌గా తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా,ఇప్పటికే 1.15లక్షల మంది నమోదు చేసుకున్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఐదు లక్షల చొప్పున మొత్తం 15లక్షల డ్వాక్రా సంఘాల సభ్యులను ఆంత్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఏఐ ఆధారిత ఆగ్రోనమీ అసిస్టెంట్ అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఏ పంట వేయాలి,ఎప్పుడు ఎరువులు వేయాలి,పురుగుమందులు ఎప్పుడు పిచికారీ చేయాలి వంటి అంశాలపై ముందుగానే ప్రణాళిక రూపొందించేందుకు ఈ సాంకేతిక సహాయం ఉపయోగపడుతుందని చెప్పారు. కుసుమ్ పథకం కింద మూడు లక్షల పంప్‌సెట్లు అందిస్తున్నామని, ఆరు లక్షల రూప్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

భూగర్భ జలాలు పెరిగితే రూ.14 వేల కోట్లు ఆదా

ప్రతి సబ్‌స్టేషన్‌ను యూనిట్‌గా తీసుకుని మైక్రోగ్రిడ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షపు నీటిని సమర్థంగా వినియోగించగలిగితే రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిని రబీ పంటలకు అందించవచ్చని సీఎం తెలిపారు. భూగర్భ జలాలు పెరిగితే ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీల రాయితీల్లో సుమారు రూ.14 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని వివరించారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ నెలాఖరు వరకు 90 రోజుల్లో కాలువల్లో పూడిక తొలగించడం, డ్రెయిన్లలో అడ్డంకులు తొలగించడం వంటి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఎక్కడా ముంపు సమస్య తలెత్తకూడదని చెప్పారు.

వివరాలు 

2027 మార్చికి భూవివాదాలన్నీ పరిష్కారం

2027 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని సీఎం తెలిపారు. సంజీవని కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలని అధికారులకు సూచించారు. సార్వత్రిక ఆరోగ్య బీమా కింద ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

టెక్నాలజీ తెలిసినవారిని పీఏగా పెట్టుకోండి

ఏఐ వల్ల విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని సీఎం అన్నారు. అధికారులు సమయాభావం, సాంకేతిక పరిజ్ఞానం లోపం వంటి సమస్యలను అధిగమించేందుకు టెక్నాలజీపై పట్టు ఉన్నవారిని వ్యక్తిగత సహాయకులుగా (పీఏ) నియమించుకోవాలని సూచించారు. మార్చి 23న ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. జులై లేదా ఆగస్టు నెలల్లో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లాలో నిర్మాణంలో ఉన్న స్టీల్ ప్లాంట్ పనులు 2028 మార్చి నాటికి పూర్తవుతాయని వివరించారు.

వివరాలు 

త్వరలో ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ కార్డు

జనాభా నిర్వహణ విధానం, పీ4 కార్యక్రమాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని రూ.54 లక్షలకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అయితే అప్పటికీ పేదరికం, అసమానతలు కొనసాగితే అభివృద్ధికి అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బిలియనీర్లు లేదా ట్రిలియనీర్ల కోసం కాకుండా సాధారణ ప్రజల అభ్యున్నతికోసమే పనిచేస్తుందని అన్నారు. త్వరలో ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ కార్డు అందజేస్తామని ప్రకటించారు. అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో కోడిగుడ్లు, అరటి వంటి ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని చెప్పారు. రైతులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు.

వివరాలు 

పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి పరీక్ష పరికరాలు

రాష్ట్రంలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సీఎం తెలిపారు. గంజాయి, డ్రగ్స్ సమస్యను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి పరీక్ష పరికరాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తే ఈ సమస్యను పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని చెప్పారు. అమరావతి.. అన్ని నగరాలకు కొత్త వెర్షన్ అమరావతిలో సచివాలయానికి వెళ్లే రహదారుల వెంట నాటిన చెట్లకు పసుపు రంగు పువ్వులు విరబూస్తున్నాయని సీఎం చెప్పారు. వాటిని చూసినప్పుడు అభివృద్ధి పనులు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అమరావతి అన్ని నగరాలకు కొత్త, మెరుగైన నమూనాగా నిలవాలని, దాన్ని చూసి నాయకులు, అధికారుల్లో అభివృద్ధి దిశగా స్ఫూర్తి కలగాలని ఆకాంక్షించారు.

Advertisement