సుడిగాలుల బీభత్సం: అమెరికాలో ఆరుగురు, జార్జియాలో ఒకరు దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు ఆగ్నేయం వైపు ఉన్న రాష్ట్రాలు, దేశాల్లో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు సుడిగాలల ధాటికి ఏడుగురు చనిపోయగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వందల ఇళ్లు నేలకొరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
సెంట్రల్ అలబామాలో సుడిగాలి కారణంగా ఆరుగురు చనిపోయారు. జార్జియాలో తీవ్రమైన గాలులతో వాహనంపై చెట్టు పడి.. ఒకరు మరణించారు.
అలబామా రాష్ట్రంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అలబామాలో సుడిగాలుల ధాటికి వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. అలబామా ఆటోగా కౌంటీలోని ఓల్డ్ కింగ్‌స్టన్ కమ్యూనిటీలో ఇళ్లు నేలకొరగడం వల్ల.. ఆరుగురు మృతి చెందగా.. మరో 12మంది గాయపడ్డారు.
సుడిగాలులు
సుడిగాలులతో 9.5 మిలియన్ల మంది ప్రభావితం: అమెరికా
ఈ బలమైన సుడిగాలుల వల్ల అమెరికా ఆగ్నేయం దిశగా ఉన్న అలబామా, మిస్సిస్సిప్పి, కెంటుకీ రాష్ట్రాలతో పాటు జార్జీయా, బర్మింగ్‌హామ్, మోంట్‌గోమెరీ, అట్లాంటా ప్రాంతాల్లో సుమారు 9.5 మిలియన్ల మంది ప్రభావితమైనట్లు అగ్రరాజ్యం వాతావరణ కేంద్రం నివేదించింది.
సుడిగాలుల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఎప్పుడూ బిజీగా ఉండే.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) విమానాశ్రయం, హార్ట్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.
ఇటీవల కాలిఫోర్నియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 18 మంది మరణించారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ విపత్తు నుంచి కోలుకోక ముందే.. అమెరికాలో సుడిగాలుల బీభత్సం ఆందోళన కలిగిస్తోంది.