Page Loader
ఎలక్ట్రాన్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రాకెట్ ల్యాబ్
నాసా వాలోప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ నుండి ఈ ప్రయోగం జరిగింది

ఎలక్ట్రాన్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రాకెట్ ల్యాబ్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 25, 2023
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్ రాకెట్ ల్యాబ్, తన ఎలక్ట్రాన్ బూస్టర్‌ తొలి ప్రయోగాన్నిఅమెరికా నుండి విజయవంతంగా నిర్వహించింది. వర్జీనియాలోని నాసా వాలోప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ నుండి జనవరి 24న సాయంత్రం 6 ESTకి (జనవరి 25వ తేదీ ఉదయం 4:30 గంటలకు) ప్రయోగించారు. HawkEye 360 అనే రేడియో ఫ్రీక్వెన్సీ అనలిటిక్స్ సంస్థ కోసం మూడు వాణిజ్య రేడియో ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ ఉపగ్రహాలు లోపల ఉన్నాయి. రాకెట్ ల్యాబ్ న్యూ జిలాండ్‌లోని ఇదివరకే ఎలక్ట్రాన్ మిషన్ల ప్రయోగాలను నిర్వహించింది. అమెరికా నుండి ఎలక్ట్రాన్ బూస్టర్ ప్రయోగం మాత్రం ఇదే మొదటిసారి. మొదట ఈ ప్రయోగం డిసెంబర్ 2022 లో ప్లాన్ చేశారు, కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆపేశారు.

నాసా

రాకెట్ ల్యాబ్ 2024 నాటికి HawkEye 360 కోసం 15 ఉపగ్రహాలను ప్రయోగించనుంది

లిఫ్ట్‌ఆఫ్ అయిన గంటలోపే, మూడు ఉపగ్రహాలను దాదాపు 550కిమీ ఎత్తులో ఉంచగలిగారు. అయితే, కమ్యూనికేషన్స్-రిసీవింగ్ గ్రౌండ్ స్టేషన్‌లో సమస్యల కారణంగా ఈ సమాచారం 35 నిమిషాలు ఆలస్యంగా అందింది. ఈ ప్రయోగం HawkEye 360తో ఒప్పందం కుదుర్చుకున్న మూడు మిషన్లలో మొదటిది. రేడియో ఫ్రీక్వెన్సీ నిఘా కోసం కంపెనీ చిన్న ఉపగ్రహాల సూట్‌ను నిర్మిస్తోంది. అందులో భాగంగా, 2024 నాటికి HawkEye 360 కోసం 15 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. నాసా అటానమస్ ఫ్లైట్ టెర్మినేషన్ యూనిట్ (NAFTU) మిషన్‌కు అవసరమైన విమాన భద్రతా టెక్నాలజీలో క్లిష్టమైన భాగాన్ని అభివృద్ధి చేయడంలో నాసా సహాయపడింది. రాకెట్ ల్యాబ్ వర్జీనియా లాంచ్ ప్యాడ్ నుండి ప్రతి నెలా దాదాపు ఒక ఎలక్ట్రాన్ మిషన్‌ను ప్రయోగించాలని భావిస్తోంది.