LOADING...
నాసా సైక్ గ్రహశకలం-ప్రోబింగ్ మిషన్ అక్టోబర్ లో ప్రారంభం
నాసా సైక్ మిషన్ అక్టోబర్‌లో ప్రారంభించటానికి షెడ్యూలైంది

నాసా సైక్ గ్రహశకలం-ప్రోబింగ్ మిషన్ అక్టోబర్ లో ప్రారంభం

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 17, 2023
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాసా సైక్ మిషన్ అక్టోబర్‌లో ప్రారంభించటానికి షెడ్యూల్ అయింది. అంగారక గ్రహం,బృహస్పతి మధ్య ఉన్న ప్రధాన గ్రహశకలం బెల్ట్‌లో ఉన్న సైక్ 16 అనే లోహ-సంపన్నమైన గ్రహశకలం గురించి తెలుసుకోవడానికి స్పేస్ ప్రోబ్ నిర్మించబడింది. ఈ మిషన్ వాస్తవానికి ఆగస్టు-అక్టోబర్ 2022 మధ్య ప్రారంభించాలని ప్రణాళిక వేశారు. అయితే స్పేస్‌క్రాఫ్ట్ ఫ్లైట్ సాఫ్ట్‌వేర్ తో పాటు టెస్టింగ్ పరికరాలు సమయానికి డెలివరీ కాలేదు అందుకే ఆలస్యమైంది. సైక్ మిషన్ అనే స్పేస్ ప్రోబ్ రాళ్ళు, మంచుతో కాకుండా లోహంతో రూపొందిన సైక్ 16 గ్రహశకలాన్ని పరిశోధిస్తుంది. దీనికి ముందు, నాసా గెలీలియో మిషన్ ఒక గ్రహశకలం దాటి ప్రయాణించిన మొదటి అంతరిక్ష నౌక. ఇది 1991లో గ్రహశకలం గ్యాస్పరా, 1993లో ఇడాను దాటింది.

నాసా

ఆగస్టు 2029లో దాని లక్ష్య గ్రహశకలం వద్దకు చేరుకుంటుంది

ఈ సంవత్సరం ప్రయోగం తర్వాత ప్రతిదీ సరిగ్గా జరిగితే, సైక్ స్పేస్‌క్రాఫ్ట్ 2026లో మార్స్ వద్దకు చేరుకోవడానికి షెడ్యూల్ అయింది. ఆగస్టు 2029లో దాని లక్ష్య గ్రహశకలం వద్దకు చేరుకుంటుంది. సైక్ స్పేస్‌క్రాఫ్ట్ 2029లో దాని లక్ష్య గ్రహశకలం వద్దకు విజయవంతంగా చేరుకున్న తర్వాత, ఇది నాలుగు స్టేజింగ్ కక్ష్యల నుండి పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ సమయంలో, ఆస్టరాయిడ్ క్యారెక్టరైజేషన్, గ్రావిటీ సైన్స్, ఎలిమెంటల్ మ్యాపింగ్ , స్థలాకృతి వంటి వాటిపై సమాచారాన్ని పొందుతుంది. భూమితో కమ్యూనికేట్ చేయడానికి సమీప-ఇన్‌ఫ్రారెడ్ తరంగాల వద్ద ఫోటాన్‌లలో డేటాను ఎన్కోడ్ చేసే కొత్త లేజర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. రేడియో తరంగాలకు బదులుగా కాంతి ఉపయోగించడం ద్వారా స్పేస్‌క్రాఫ్ట్ త్వరగా ఎక్కువ డేటాను ప్రసారం చేయగలదు.