సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాన్నిTESS టెలిస్కోప్ ద్వారా గుర్తించిన నాసా
ఖగోళ శాస్త్రవేత్తలు, నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) సహాయంతో, TOI 700 e అనే ఒక ఎక్సోప్లానెట్‌ను కనుగొన్నారు, ఇది భూమికి 95% పరిమాణం ఉండడమే కాదు భూగ్రహం లాగే రాతిలాగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎక్సోప్లానెట్ అది తిరిగే నక్షత్రం (TOI 700) నివాసయోగ్యమైన జోన్‌లో నీటిని నిలుపుకోగలిగే దూరంలో ఉంది. TOI 700 eను కనుగొన్న గ్రహాంతర గ్రహ వ్యవస్థలో, శాస్త్రవేత్తలు గతంలో TOI 700 b, TOI 700 c, TOI 700 d కనుగొన్నారు. ఇవన్నీ సూర్యుని పరిమాణంలో దాదాపు 40% ఉండే TOI 700 నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఇది భూమి నుండి దాదాపు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
నక్షత్ర కాంతిలో మార్పుల ఆధారంగా మిగిలిన అంశాలు శాస్త్రవేత్తలు గుర్తిస్తారు
నక్షత్రం కాంతిలో మార్పుల ఆధారంగా, ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహం పరిమాణం, కక్ష్య, సమయం వంటి అంశాలను గుర్తించగలరు. TOI 700 b ఒక కక్ష్యను పూర్తి చేయడానికి 10 రోజులు పడుతుంది. TOI 700 c భూ గ్రహం కంటే 2.5 రెట్లు ఎక్కువ 16 రోజుల్లో ఒక కక్ష్యను పూర్తి చేస్తుంది, అయితే d గ్రహం 37 రోజుల్లో కక్ష్యను పూర్తి చేస్తుంది. TOI 700 e 28 రోజుల్లో ఒక కక్ష్యను పూర్తి చేస్తుంది. ఈ ప్రాంతంలో భూమి-పరిమాణ గ్రహాలను కనుగొనడం వలన మన సౌర వ్యవస్థ చరిత్రను బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ వ్యవస్థపై మరిన్ని పరిశోధనలు జరపడానికి నాసా సిద్దమైంది.