శని గ్రహం చుట్టూ ఉండే వలయాల గుట్టు విప్పిన NASA
NASA హబుల్ స్పేస్ టెలిస్కోప్ చాలా సంవత్సరాలుగా శనిగ్రహాన్ని పర్యవేక్షిస్తుంది, ఎందుకంటే ఈ గ్రహం సూర్యుని చుట్టూ 29 సంవత్సరాల సుదీర్ఘ కక్ష్యలో తిరుగుతుంది. కక్ష్యలో తిరుగుతున్నప్పుడు గ్రహం చుట్టూ ఉండే వలయాలు ఎలా విభిన్నంగా కనిపిస్తాయో ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. శని వలయాలు సూర్యుని చుట్టూ కదులుతున్నప్పుడు పూర్తిగా తెరుచుకున్నట్టు ఉంటాయి. ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ గౌరవార్థం పేరు పెట్టబడిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ 1990లో ప్రయోగించారు. ఇది అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ప్రధాన ఆప్టికల్ టెలిస్కోప్, ఇది భూమి చుట్టూ 535కిమీ ఎత్తులో తిరుగుతుంది. శని గ్రహం చిత్రాలు 1996 నుండి 2000 మధ్యకాలంలో టెలిస్కోప్ ద్వారా తీయబడ్డాయి, గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు మారుతున్న వలయాలు కనిపిస్తాయి.
వలయాలను అంచు నుండి చూసినప్పుడు చిన్నగా కనిపిస్తాయి
శని గ్రహ వలయాలు, వాటి అంచు నుండి చూసినప్పుడు, చిన్నవిగా, సన్నగా కనిపిస్తాయి. కానీ గ్రహం దాని కక్ష్యలో ఒక కోణం నుండి చూడగలిగేలా మరింత ప్రయాణించినప్పుడు, దాని వలయాలను పూర్తిగా చూడచ్చు . శని గ్రహ వలయాల సమూహం 282,000 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ప్రతి వలయం మధ్య ఖాళీలు, విభజనలు ఉన్నాయి. శని గ్రహ వలయాలు తోకచుక్కలు, గ్రహశకలాలు లేదా పగిలిపోయిన చంద్రుల ముక్కలతో ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. చిత్రంలో చూసినట్లుగా, శని చుట్టూ తిరిగే బూడిద రంగు వలయాలు కాస్సిని డివిజన్ ద్వారా కలుస్తాయి, ఇది 4,700 కిలోమీటర్లు ఉంటుంది. కాస్సిని అంతరిక్ష నౌకతో సహా ఇప్పటివరకు నాలుగు రోబోటిక్ మిషన్ల ద్వారా శనిగ్రహాన్ని అన్వేషించారు.