India: చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి అవసరమా? భారత్ విధానం ఏంటంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం తన ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ధర, సరఫరా స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం, దేశీయ ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేయడం అత్యంత ముఖ్యమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటీవల ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ వివాదాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్‌కి అమెరికా 'పర్మిషన్' అవసరమని ఒక కథనం మీడియా చర్చల్లో రేకెత్తించింది. అయితే, ఇది అసలు తప్పుదారి పట్టే వాదన. నిజానికి, చమురు కొనుగోలుకు భారత్‌కు ఏ ఇతర దేశం నుంచి అనుమతి అవసరం లేదు. భారత్ తన ఇంధన దౌత్యం, ఆర్థిక విధానాన్ని స్వతంత్రంగా నిర్ణయిస్తుంది.
Details
వాస్తవ పరిస్థితి
ఫిబ్రవరి 2026 నాటికి రష్యా భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా నిలిచింది. భారత రిఫైనరీలు రోజుకు సగటున 10-17లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుండి దిగుమతిస్తున్నాయి. మొత్తం ముడి చమురు దిగుమతులలో రష్యా వాటా సుమారు 25-30 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో దాదాపు 28-48మిలియన్ బ్యారెళ్ల చమురు రష్యా నుండి కొనుగోలు చేయబడింది, అంటే ప్రతిరోజూ సుమారు 10లక్షల బ్యారెల్ల చమురు. ఈ సంఖ్యలు చూపిస్తున్నట్లు, భారత్ చేసే ఇంధన ఎంపికలు ఇతర దేశాల నియంత్రణలో ఉండవు. అమెరికా లేదా ఇతర విదేశీ శక్తుల "అనుమతి"పై ఆధారపడకుండా, భారత్ స్వయంప్రతిపత్తి తో తన ఇంధన భద్రతను రక్షిస్తుంది. ఈ దృక్కోణాన్ని భారత ప్రభుత్వం కొన్నేళ్లుగా స్పష్టంగా మళ్లీ మళ్లీ ప్రకటిస్తుంది.
Details
భారత ఇంధన వ్యూహం
రష్యా నుండి కొనుగోలు చేసే ప్రతి బ్యారెల్ చమురు దేశీయ రవాణా, విద్యుత్ తయారీ రంగాల ఖర్చులను తగ్గిస్తుంది. ఇది మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నప్పుడు, ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను బట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది.
Details
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుద్ధ కారణంగా ఖతార్‌లో గ్యాస్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో, భారత్ తన ఇంధన సరఫరా మార్గాలను విస్తృతం చేసి, పరిమితం చేయకూడదు. రష్యా, గల్ఫ్ దేశాలు, అమెరికా తదితర సరఫరాదారులతో కూడా భారత్ మైత్రి మరియు వాణిజ్య చర్చలలో చురుకుగా ఉంది. కానీ ఈ చర్చలను 'అనుమతి'గా అర్థం చేసుకోవడం తప్పు. భారత్ తన చమురు కొనుగోలు విధానాన్ని సార్వభౌమత్వాన్ని భంగం చేయకుండా, దేశాభివృద్ధికి అవసరమైన ఇంధనాన్ని పోటీ ధరల్లో సమకూరుస్తుంది. మొత్తంగా భారతదేశం చమురు కొనుగోలులో ఇతర దేశాల పర్మిషన్ అవసరం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది.