LOADING...
Lpg Gas: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు

Lpg Gas: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) ధరలు భారీగా పెరిగాయి. చమురు సంస్థలు గృహ వినియోగ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచాలని నిర్ణయించాయి. ఈ కొత్త ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.965కు చేరింది. ఉజ్వల్‌ పథకం కింద అందించే సిలిండర్‌ల ధరల్లో మార్పు ఏమీ రాదని చమురు సంస్థలు స్పష్టం చేశారు. ధరల పెరుగుదల వెనుక కారణంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ప్రభావం చూపాయని తెలుస్తోంది.

Details

ప్రధాన నగరాల్లో కొత్త ధరలు

గృహ వినియోగ సిలిండర్ (14.2 కేజీ) దిల్లీ: రూ.913 ముంబయి: రూ.912.50 కోల్‌కతా: రూ.939 చెన్నై: రూ.928.50 వాణిజ్య సిలిండర్ (19 కేజీ) దిల్లీ: రూ.1883 ముంబయి: రూ.1835 కోల్‌కతా: రూ.1990 చెన్నై: రూ.2043

Details

ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తం

పశ్చిమాసియాలోని ఘర్షణల కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. దేశంలో ఎలాంటి కొరత లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఎక్స్ వేదిక ద్వారా పోస్ట్ చేశారు. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా దేశంలో పెట్రోల్‌, డీజిల్ కొరత సంబంధించి నెట్టింట్లో ప్రచారంలో ఉన్న సమాచారం నిజం కాదని స్పష్టం చేసింది. ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ అందుబాటులోనే ఉన్నాయన్నారు. హర్మూజ్ అంతరాయం ఉన్న సమయంలో కూడా వేర్వేరు సోర్సుల ద్వారా దేశానికి భారీగా ఇంధనం లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement