Srisailam: శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా ఆలయాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి రాకపోకలు సాగించే భక్తులు మహా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్ రోడ్డులో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో, కొండచరియలు పెద్ద ఎత్తున విరిగి పడిపోయాయి. ముఖ్యంగా డ్డయమ్, స్విచ్ యార్డ్ ప్రాంతాల వద్ద బండరాళ్లు, చెట్లు, మట్టి విరిగి రోడ్డుమీదకు పడిపోయాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు.
వివరాలు
ట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
కొండచరియలు విరిగిన సమయానికి ఆ ప్రాంతంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారు, బస్సు లేదా లారీలు ఆ దారిలో ఉన్నట్లయితే, భారీ నష్టం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని అంచనా వేసేందుకు సంబంధిత విభాగాలు చర్యలు ప్రారంభించాయి. వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో, ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.