తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా
US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ US-ఆధారిత విభాగం ఆంజినా, అధిక రక్తపోటు కొన్ని రకాల గుండె చికిత్సలకు ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను వెనక్కి రప్పిస్తుంది. డ్రగ్ సంస్థ సన్ ఫార్మా అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే 34,000 కంటే ఎక్కువ జెనరిక్ మందుల బాటిళ్లను US మార్కెట్‌లో డిసల్యూషన్ టెస్టింగ్ విఫలమైన కారణంగా వెనక్కి రప్పిస్తుంది. ప్రిన్స్‌టన్ (న్యూజెర్సీ) ఆధారిత సన్ ఫార్మాస్యూటికల్ సంస్థ స్టెబిలిటీ టెస్టింగ్ సమయంలో ఫెయిల్డ్ ఇంప్యూరిటీ (డీసెటైల్ డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్) స్పెసిఫికేషన్ తో పాటు FDA లేబొరేటరీలో విఫలమైన డిసోల్యూషన్ టెస్టింగ్ కారణంగా ప్రభావితమైన సరఫరాను వెనక్కి రప్పిస్తుంది.
ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు దారి తీయకుండా ముందస్తు జాగ్రత్తలు
ముంబైకి చెందిన ఈ డ్రగ్ సంస్థ గుజరాత్‌లోని హలోల్ ఆధారిత తయారీ కేంద్రంలో లాట్‌ను ఉత్పత్తి చేసింది. ప్రభావితమైన స్థలం దాని US-ఆధారిత యూనిట్ ద్వారా మార్కెట్‌లో పంపిణీ చేయబడింది. కంపెనీ ఈ ఏడాది జనవరి 13 నుండి దేశవ్యాప్తంగా(US) ఆ బాటిళ్ళను ను వెనక్కి తెప్పించడం ప్రారంభించింది. USFDA ప్రకారం, ఈ విఫలమైన ఉత్పత్తిని ఉపయోగించడం లేదా బయట ఉంచడం వలన తాత్కాలిక లేదా వైద్యపరంగా ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు దారి తీయచ్చు.