
వివిధ రకాల గుండె జబ్బులకు కారణాలు
ఈ వార్తాకథనం ఏంటి
గుండెజబ్బులలో అరిథ్మియా, అథెరోస్క్లెరోసిస్, కార్డియోమయోపతి, పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె ఇన్ఫెక్షన్లు వంటి అనేక రకాలు ఉన్నాయి.
అరిథ్మియా అంటే అసాధారణంగా గుండె కొట్టుకోవడం, కళ్ళు తిరిగినట్టు ఉండటం, గుండె వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
అథెరోస్క్లెరోసిస్ అంటే నాడీ వ్యవస్థ గట్టిపడటం, శరీర భాగాల్లో తిమ్మిరి పట్టడం, కాళ్లు, చేతులు బలహీనంగా మారటం వంటి లక్షణాలు ఉంటాయి.
కార్డియోమయోపతి అంటే గుండె కండరాలు బలహీనంగా మారటం అలసట,ఉబ్బరం,కాళ్ళ వాపు, వేగంగా పల్స్ కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
బాక్టీరియా, వైరస్‌ల వల్ల గుండె ఇన్‌ఫెక్షన్‌లు రావచ్చు, ఛాతిలో నొప్పి, దగ్గు, జ్వరం, చలి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.
గుండె జబ్బు
అవసరమైన చికిత్స ఈ సమస్యకు పరిష్కారం
పుట్టుకతో వచ్చే గుండె లోపాలు కొన్నిసార్లు శిశువు పుట్టినప్పటి వరకు తెలియకపోవచ్చు. నీలం రంగు చర్మం, లోపలి భాగాల వాయడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసట, అసాధారణ గుండె లయ వంటి లక్షణాలు ఉంటాయి.
కరోనరీ ఆర్టరీ వ్యాధి అంటే గుండె నాడుల్లో అడ్డు ఏర్పడడం దీనినే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అంటారు. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవటం, వికారం, అజీర్తి వంటి లక్షణాలు ఉంటాయి.
అధిక కొలెస్ట్రాల్, హైబిపి, పొగ తాగడం, అధిక బరువు గుండె జబ్బులకు ముఖ్య కారణం.
పండ్లు, కూరగాయలలో వంటి తక్కువ సోడియం, తక్కువ కొవ్వు ఆహారం వంటివి తీసుకుంటూ ఒత్తిడిలేని జీవనం, వ్యాయామంతో పాటు అవసరమైన చికిత్సలు ఈ సమస్యకు పరిష్కారం.