'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా
నాసా పాలపుంతకు సంబంధించిన ఒక చిత్రాన్ని విడుదల చేసింది. నక్షత్ర మండలం లోపల కుడి వైపున కాస్మిక్ దుమ్ము, శిధిలాలతో, నక్షత్రాలతో నిండి ఉన్నా సరే చిత్రంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ ఘనత "త్రీ అమిగోస్" తో అంటే స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్, చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ వలన సాధ్యమైంది . అంతరిక్ష పరిశోధనలో పురోగతి వలన మునుపెన్నడూ లేని విధంగా విశ్వాన్ని వీక్షించవచ్చు. ఇప్పుడు నాసా విడుదల చేసిన ఈ చిత్రంతో అది రుజువు అయింది. స్పిట్జర్ టెలిస్కోప్ దాని 16 సంవత్సరాల ఆపరేషన్ సమయంలో అత్యంత సుదూర నక్షత్ర మండలాలను అధ్యయనం చేసింది. శని గ్రహం పెద్ద వలయాన్ని కనుగొంది.
హబుల్ స్పేస్ టెలిస్కోప్ కనిపించే కాంతి ప్రాంతంలో పనిచేస్తుంది
కనిపించే కాంతిలో పనిచేసే హబుల్ స్పేస్ టెలిస్కోప్, సమీపంలోని పెద్ద నక్షత్రాల నుండి ఉత్పన్నమయ్యే నక్షత్ర గాలులు, రేడియేషన్‌ను చూపిస్తుంది. నక్షత్రాలు నక్షత్ర మండలం మధ్యలో పసుపు, బంగారు రంగులలో కనిపిస్తాయి. స్పిట్జర్ టెలిస్కోప్ అందించిన డేటా నక్షత్ర మండలం లోపలి భాగం గురించి మరింత సమాచారాన్ని వెల్లడిస్తుంది. ఎరుపు, నారింజ షేడ్స్‌లో చూసినట్లుగా, టెలిస్కోప్ అసంఖ్యాక నక్షత్రాలను, నక్షత్రాలు పుట్టే ప్రాంతం గురించి కూడా తెలుపుతుంది. ఆగస్ట్ 2003లో ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోప్ జనవరి 2020లో తన మిషన్‌ను ముగించింది. చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ నక్షత్ర మండల లోపలి భాగాన్ని గులాబీ, నీలం రంగులలో వర్ణిస్తుంది, ఇక్కడ గులాబీ తక్కువ శక్తి X-కిరణాలను సూచిస్తే, నీలం అధిక శక్తిని సూచిస్తుంది.