Page Loader
ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు!
కొలికివచ్చిన ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం

ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు!

వ్రాసిన వారు Stalin
Feb 02, 2023
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులో నిఘా కోసం అమెరికా నుంచి అత్యాధునిక 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసే అంశంపై భారత్ కొంతకాలంగా అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతోంది. తాజాగా ఆ చర్చలు చివరి దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. రెండురోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్‌తో జరిపిన చర్చల్లో ఈ మేరకు అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. 30ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందాాన్ని వీలైనంత తర్వగా పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో ఇరు దేశాలు ఉన్నట్లు ఆమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. తుది నిర్ణయం మాత్రం భారత చేతిలోనే ఉందని స్పష్టంచేశాయి.

భారత్-అమెరికా

భారత్ కంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నఅమెరికా

2022 మేలో టోక్యోలో జరిగిన క్వాడ్ సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన ఇన్షియేటివ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐసీఈటీ) చర్చకు కొనసాగింపుగానే అజిత్ ధోవల్- జేక్ సుల్లివన్‌ సమావేశమయ్యారు. ఇందులో 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందంపై చర్చించినట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఒప్పందం విషయంలో భారత్ కంటే అమెరికానే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 3బిలియన్ డాలర్ల విలువై ఈ ఒప్పందం బైడెన్ ప్రభుత్వానికి చాలా కీలకం. కొత్త ఉద్యాగాల కల్పనతో పాటు రాజకీయంగా ఇది ఉపయోగపడుతుందని బైడన్ భావిస్తున్నారు.