ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం
ఫిబ్రవరి 5 న పౌర్ణమి వస్తుంది. దీనికి ఒక ఆసక్తికరమైన పేరుంది అదే స్నో మూన్. Earthsky.org ప్రకారం, ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఉండే లియో రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రం అయిన రెగ్యులస్ సమీపంలో ఈ పౌర్ణమి కనిపిస్తుంది. ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతుల ప్రజలు వివిధ పేర్లతో పిలుస్తారు. జనవరిలో వచ్చే పౌర్ణమిని వోల్ఫ్ మూన్ అని, మార్చిలో వచ్చే చంద్రుడిని వార్మ్ మూన్ అని పిలుస్తారు. ఫిబ్రవరిలో పౌర్ణమిని స్థానిక అమెరికన్ తెగలు స్నో మూన్ లేదా హంగర్ మూన్ అని పిలుస్తారు. ఈ సీజన్‌లో ఎక్కువగా మంచు కురుస్తుంది కాబట్టి ఈపేరు వాడుకలోకి వచ్చింది.
ఫిబ్రవరిలో వచ్చే మైక్రో మూన్ 2023లో రెండవది
రాబోయే పౌర్ణమిని మైక్రో మూన్ అంటారు.చంద్రుడు తన కక్ష్యలో భూమికి చాలా దూరం వెళ్లబోతున్నాడు. ఫిబ్రవరిలో వచ్చే మైక్రో మూన్ 2023లో రెండవది, ఇదే చివరి మైక్రో మూన్ అవుతుంది. జనవరిలో ఒక మైక్రో మూన్ వచ్చింది.చంద్రుడు భూమికి దాదాపు 405,830 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మాములు దూరం 382,500 కి.మీ. మైక్రో మూన్ సాధారణ పౌర్ణమి కంటే చిన్నదిగా కనిపిస్తుందా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఫోటోగ్రాఫ్‌లలో, కొంతమంది అనుభవజ్ఞులైన పరిశీలకులు రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలరు. చాలా సంవత్సరాలలో, ఫిబ్రవరి పౌర్ణమి సింహరాశిలో ఉంటుంది, అయితే ఇది 2026లో కర్కాటక రాశిలో కూడా వస్తుంది. చాలా అరుదుగా ఫిబ్రవరిలో పౌర్ణమి రాకపోవచ్చు ఇలాంటిదే 2037లో జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.