Page Loader
టాప్ 5 వాట్సాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం
రాబోయే వారాల్లో టాప్ 5 వాట్సాప్ ఫీచర్లు ఇవే

టాప్ 5 వాట్సాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 23, 2023
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా ఈ ప్లాట్‌ఫారమ్ లో అనేక కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేస్తోంది, వీటిని త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఈ ఫీచర్లలో కొన్ని బీటా టెస్టింగ్ దశలో ఉన్నాయి, మరికొన్ని ఇంకా అభివృద్ధిలో ఉన్నాయి. ఫీచర్ #1: వాయిస్ స్టేటస్ పెట్టే అవకాశం వాట్సాప్ త్వరలో వాయిస్ సందేశాలను స్టేటస్ అప్‌డేట్‌లుగా పోస్ట్ చేసే ఫీచర్ పై పని చేస్తోంది. ఇది ప్రస్తుతం కొన్ని Android/iOS బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. రాబోయే ఫీచర్ టెక్స్ట్ స్టేటస్ విభాగంలో అందుబాటులో ఉంటుంది, అక్కడ 'మైక్రోఫోన్' పై క్లిక్ చేస్తే 30-సెకన్ల వాయిస్ నోట్‌ స్టేటస్‌గా సెట్ చేయచ్చు. మిగతావాటిలాగే ఇది 24 గంటల వరకే ఉంటుంది.

వాట్సాప్

నోటిఫికేషన్‌ల విభాగంలోనే కాంటాక్ట్‌లను బ్లాక్ చేసే అవకాశం

ఫీచర్ #2: వాట్సాప్ ఫోటోలను వాటి ఒరిజినల్ క్వాలిటీలో షేర్ చేసుకునే సదుపాయాన్ని పరిచయం చేయబోతోంది. ఫీచర్ #3: గూగుల్ డ్రైవ్ తో సంబంధం లేకుండా ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ మైగ్రేషన్. రాబోయే 'చాట్ ట్రాన్స్‌ఫర్' ఫీచర్ లో QR కోడ్‌ని (పాత ఫోన్ నుండి) స్కాన్ చేయడం ద్వారా బదిలీ చేసుకోవచ్చు. ఫీచర్ #4: వాట్సాప్ వినియోగదారులకు చాట్ లిస్ట్, నోటిఫికేషన్‌ల విభాగంలోనే కాంటాక్ట్‌లను బ్లాక్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో బీటా దశలో ఉంది. ఫీచర్ #5: చాట్ చిత్రాల నుండి టెక్స్ట్ తీయచ్చు. వాట్సాప్ iOS 16 వినియోగదారులకు వారి చాట్ లో చిత్రాలలోని టెక్స్ట్ కాపీ చేసే అవకాశాన్ని ఇస్తుంది.