Page Loader
త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్
రాబోయే వారాల్లో అందరికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది

త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 18, 2023
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాయిస్ సందేశాన్నిస్టేటస్‌గా పోస్ట్ చేసుకునే అవకాశం త్వరలో వాట్సాప్ తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఫీచర్‌తో, టెక్స్ట్‌కు బదులుగా వాయిస్ క్లిప్‌లను రికార్డ్ చేసి పోస్ట్ చెయ్యచ్చు. పేరెంట్ సంస్థ మెటా ఆండ్రాయిడ్ ఛానెల్‌లోని కొంతమంది బీటా వినియోగదారులకు ఈ అప్‌డేట్ వెర్షన్ 2.23.2.8ను విడుదల చేసింది. ఈ వాయిస్ స్టేటస్ ఫీచర్ పై ఈ సంస్థ జూలై 2022 నుండి పనిచేస్తుంది. ఇప్పటి వరకు టెక్స్ట్, ఫోటోలు, వీడియోలను మాత్రమే స్టేటస్‌లుగా షేర్ చెయ్యచ్చు కానీ ఈ అప్డేట్ వెర్షన్ అందుబాటులోకి వస్తే వాయిస్ క్లిప్‌లను కూడా షేర్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వస్తుంది.

వాట్సాప్

మిగతా వాటిలాగే వాయిస్ స్టేటస్‌లు కూడా 24 గంటల వరకే ఉంటాయి

ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయడానికి, Text status విభాగానికి వెళ్తే 'Microphone' ఐకాన్ పై క్లిక్ చెయ్యాలి. 30-సెకన్ల వాయిస్ సందేశం షేర్ చేయచ్చు. వీటిని కొంతమంది మాత్రమే వినాలనుకుంటే Privacy Settingsలో ఎంచుకున్న కాంటాక్ట్స్ మాత్రమే ఆ సందేశాన్ని వినగలరు. మిగతా స్టేటస్ అప్‌డేట్‌ల లాగానే వాయిస్ స్టేటస్‌లు కూడా 24 గంటల వరకే ఉంటాయి. బీటా వినియోగదారులు వాయిస్ స్టేటస్‌లను పోస్ట్ చేయడానికి యాప్ తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. రాబోయే వారాల్లో అందరికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ తో పాటు నోటిఫికేషన్ ప్యానెల్ నుండి బ్లాక్ చేసే , సులభంగా చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ల మీద వాట్సాప్ పని చేస్తుంది.