ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్
ఫోన్‌లను మార్చినప్పుడు వాట్సాప్ చాట్ హిస్టరీని బదిలీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. గత సంవత్సరం, ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్ చాట్‌లను సులభంగా తరలించే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. ఈ కంపెనీ ఇప్పుడు చాట్ చరిత్రను కొత్త Android డివైజ్ కు సులభంగా ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్‌పై పని చేస్తోంది. 2021లో వాట్సాప్ ఐఫోన్-నుండి-ఐఫోన్ , 2022లో, ఆండ్రాయిడ్-నుండి-ఐఫోన్ డేటా ట్రాన్స్ఫర్ ఫీచర్ వచ్చింది. ఈ కొత్త ఫీచర్ సెట్టింగ్‌లలో 'చాట్స్' కింద ఉంటుంది ప్రస్తుతం వాట్సాప్ Android 2.23.1.25 కోసం బీటాను విడుదల చేసింది. కొత్త అప్‌డేట్‌లో, ఈ కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలిసింది. అందరికి అందుబాటులోకి వచ్చాక ఈ ఫీచర్ ను సెట్టింగ్‌లు > చాట్‌లకు వెళ్లడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
గూగుల్ డిస్క్‌కి చాట్ హిస్టరీని బ్యాకప్ చేయాల్సిన అవసరం లేదు
చాట్‌ని ట్రాన్స్ఫర్ చేయడానికి, ''Chat Transfer to Android' మీద క్లిక్ చేయాలి.కొత్త ఆండ్రాయిడ్ డివైజ్ కు మారడం అంటే వాట్సాప్ చాట్ హిస్టరీని గూగుల్ డ్రైవ్ కు బ్యాకప్ చేయడం. అయితే, కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, చాట్‌లను బ్యాకప్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, మీరు ఒకే క్లిక్‌తో ఆండ్రాయిడ్ డివైజ్ కు చాట్‌లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ ఈ ఫీచర్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందో సృష్టంగా తెలియలేదు. త్వరలోనే ఫీచర్ దీని గురించి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది.