మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు
టెక్ సంస్థలు మళ్ళీ వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే USలోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఈసారి కోతలు మరింత ఎక్కువగా ఉండచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ ఈ నెలలో వేలాది ఉద్యోగాల కోతలను ప్రకటించే అవకాశం ఉంది. గూగుల్ రివ్యూస్ అండ్ డెవలప్‌మెంట్ (జిఆర్‌ఎడి) అని పిలవబడే పనితీరు రేటింగ్ సిస్టమ్‌తో కంపెనీ ఉద్యోగులకు రేటింగ్ ఇస్తుంది. కొత్త విధానంలో ఉద్యోగాల కోతలను ప్రకటించాలని ఈ సంస్థ భావిస్తుంది "కొత్త విధానంలో, వ్యాపారానికి వారి ప్రభావం పరంగా 6 శాతం మంది ఉద్యోగులను అంటే దాదాపు 10,000 మంది ఉద్యోగులను తక్కువ పనితీరు ఉన్నవారిగా విభజించాము" అని గూగుల్ సంస్థ తెలిపింది.
కంపెనీల వార్షిక ప్రణాళికల్లో తొలగింపు కూడా భాగమే
2023లో కూడా అమెజాన్‌లో తొలగింపులు కొనసాగుతాయని కంపెనీ సీఈవో, ఆండీ జాస్సీ నవంబర్ 2022లో హెచ్చరించారు. కంపెనీ వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్షలో ఉద్యోగాల తగ్గింపులు ఒక భాగమని జాస్సీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో ఉన్న సవాలు కారణంగా ఈ సంవత్సరం సమీక్ష కష్టంగా మారిందని జాస్సీ చెప్పారు. కొత్త సంవత్సరంలో ఉద్యోగాల్లో కోతలు వస్తున్నాయని, జనవరి ప్రథమార్థంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింపు ఉంటుందని గోల్డ్‌మన్ సాక్స్ సీఈవో డేవిడ్ సోలమన్ ఉద్యోగులను హెచ్చరించారు. " చర్చలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగుల తగ్గింపు జనవరి మధ్యలో ఉండచ్చు" అని సోలమన్ చెప్పారు. 2022 సంవత్సరంలో US టెక్ సెక్టార్‌లో 91,000 కంటే ఎక్కువ మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.