హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న 2024 టయోటా గ్రాండ్ హైలాండర్
జపాన్ తయారీ సంస్థ టయోటా గ్లోబల్ మార్కెట్ లో గ్రాండ్ హైలాండర్ 2024 వెర్షన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 11న జరగబోయే 2023 చికాగో ఆటో షోలో దీనిని ప్రదర్శిస్తారు. ఈ కంపెనీ ప్రస్తుతం అనేక రకాల SUVలు, MPVలతో US మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తుంది. కొత్త మోడల్‌తో, SUV సెగ్మెంట్‌లో హైబ్రిడ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 టయోటా గ్రాండ్ హైలాండర్ బ్రాండ్ కొత్త డిజైన్ తో వస్తుంది. దీని పవర్‌ట్రెయిన్‌ల అవుట్‌పుట్ వివరాలను ఇంకా విడుదల చేయలేదు. SUV 2.4-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 2.5-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్-హైబ్రిడ్ యూనిట్, క్రౌన్ సెడాన్ నుండి బ్రాండ్ అత్యాధునిక 2.4-లీటర్ "హైబ్రిడ్ మ్యాక్స్" మోటారుతో వస్తుంది.
ప్రయాణీకుల భద్రత కోసం టయోటా సేఫ్టీ సెన్స్ 3.0 ADAS సూట్
2024 టయోటా గ్రాండ్ హైల్యాండర్ లోపల , విలాసవంతమైన సెవెన్-సీటర్ క్యాబిన్, ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్, 11-స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, వెంట్స్, పనోరమిక్ సన్‌రూఫ్ తో పాటు మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, వెనక ACతో మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. . ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం టయోటా సేఫ్టీ సెన్స్ 3.0 ADAS సూట్ ఉంది. 2024 టయోటా గ్రాండ్ హైలాండర్ ధర, ఇతర వివరాలను వాహన తయారీ సంస్థ ఇంకా వెల్లడించలేదు. US మార్కెట్లో XLE, లిమిటెడ్, ప్లాటినం అనే మూడు ట్రిమ్ స్థాయిలలో ఈ SUV అందుబాటులో ఉంది.