Page Loader
అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG కారును విడుదల చేసిన టయోటా
హైరైడర్ CNG వెర్షన్‌ S, G వేరియంట్లలో లభిస్తుంది

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG కారును విడుదల చేసిన టయోటా

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 31, 2023
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ వాహన తయారీ సంస్థ టయోటా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారులో CNG వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది S, G వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా తర్వాత టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ రెండవ CNG-సపోర్టెడ్ SUV. భారీ ప్రీమియం రూ.95,000తో మిగతా పెట్రోల్ వేరియంట్‌ల కంటే ఎక్కువ ఉంది. హైరైడర్ కు భారతదేశంలో వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చింది. CNG కూడా ఉండడం వలన అమ్మకాలు మరింత పెరగచ్చు. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.5-లీటర్ ఇంజన్‌తో 26.6km/kg మైలేజీని ఇస్తుంది.

కార్

ప్రయాణీకుల భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG పొడవాటి బోనెట్, క్రోమ్-యాక్సెంటెడ్ గ్రిల్, ఎయిర్ డ్యామ్, స్కిడ్ ప్లేట్లు, DRLలతో ఉన్న ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది . ప్రయాణీకుల భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ కంట్రోల్, ABS, EBDతో పాటు, వెనుక పార్కింగ్ కెమెరా ఉన్నాయి. ఇందులో ఐదు-సీట్ల క్యాబిన్‌తో పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ AC, క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జర్‌లు, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ ఉన్నాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG S వేరియంట్‌ ధర రూ. 13.23 లక్షలు, G వేరియంట్‌ ధర రూ. 15.29 లక్షలు. నాన్- CNG మోడల్ ధర రూ. 10.48-18.99 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).