ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్-ఫోకస్డ్ టిప్పింగ్ ఫీచర్ యాక్సెస్‌ను విస్తరిస్తున్న మెటా
గత నవంబర్‌లో, క్రియేటర్‌లు డబ్బు సంపాదించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'గిఫ్ట్‌లను' మెటా పరిచయం చేసింది. ఇప్పుడు మరింత మంది క్రియేటర్‌లకు ఈ ఫీచర్ యాక్సెస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అనుచరులు క్రియేటర్‌లకు తమ ప్రశంసలను ఈ బహుమతుల రూపంలో తెలియజేస్తారు , తద్వారా డబ్బు సంపాదించవచ్చని మెటా తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. క్రియేటర్‌ల కోసం విభిన్న ఆదాయ మార్గాలను సృష్టించడం ద్వారా, తనతో పోటీపడుతున్న టిక్ టాక్ ని సవాలు చేస్తుంది. ఇది కంపెనీకి కూడా ఆదాయాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ అభిమాన క్రియేటర్‌లకు వర్చువల్ బహుమతులను పంపి వారి కంటెంట్ కు ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు. ఈ ఫీచర్ మొదట ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఉండేది.
బహుమతుల కోసం వినియోగదారులు మొదట వర్చువల్ కరెన్సీ స్టార్‌లను కొనాలి
బహుమతులను కొనడానికి, వినియోగదారులు ముందుగా వర్చువల్ కరెన్సీ స్టార్‌లను కొనాలి. దీన్ని ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుండి మాత్రమే కొనగలరు. వినియోగదారులు $0.99కి 45 స్టార్‌లను, $2.99కి 140 స్టార్‌లను లేదా $5.99కి 300 స్టార్‌లను కొనుక్కోవచ్చు. క్రియేటర్‌లు బహుమతులను స్వీకరించడానికి అర్హులో కాదో చూడటానికి వారి డ్యాష్‌బోర్డ్‌లో చూడచ్చు. క్రియేటర్‌లకు అర్హత ఉంటే వినియోగదారులకు "Send Gift " అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇటీవల ఆదాయాలు ప్రకటించేటప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వీడియో ప్లేలు 2022లో రెండింతలు పెరిగాయని, ఫీడ్స్‌తో పోలిస్తే రీల్స్ నుండి రాబడి చాలా తక్కువగా ఉందని కూడా అతను తెలిపారు.