Page Loader
వివక్షను తగ్గించడమే లక్ష్యంగా మెటా కొత్త AI ప్రకటన సాంకేతికత
వివక్షను తగ్గించడమే లక్ష్యంగా మెటా కొత్త AI ప్రకటన సాంకేతికత

వివక్షను తగ్గించడమే లక్ష్యంగా మెటా కొత్త AI ప్రకటన సాంకేతికత

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 10, 2023
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమ ప్రకటనలు వివక్షతతో ఉన్నాయనే ఆందోళనలను పరిష్కరించే ప్రయత్నంలో, మెటా కొన్ని మార్పులను రూపొందించింది. ప్రకటనలు నిర్దిష్ట సమూహాల పట్ల పక్షపాతంగా లేవని నిర్ధారించడానికి వ్యత్యాసాల తగ్గింపు వ్యవస్థ (VRS) ఏర్పాటు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ)తో సెటిల్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సమూహంపై మరొకరిని లక్ష్యంగా చేసుకునే వివక్షపూరిత ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. మెటాలో ఈ కొత్త AI టెక్ అటువంటి ప్రకటనలకు వ్యతిరేకంగా సందేశాన్ని పంపుతుంది. అయితే ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. మెటా ప్రకటనకర్తలు ఆసక్తులు, జనాభా, ప్రవర్తన ఆధారంగా వినియోగదారులను తమ ప్రకటన చేరేటట్లు లక్ష్యంగా చేసుకోవడానికి అనుమతిస్తుంది. 'యాడ్ ఆక్షన్' ద్వారా, నిర్దిష్ట సమయంలో వినియోగదారుకు ఏ ప్రకటనను చూపించాలో నిర్ణయిస్తుంది.

మెటా

గోప్యత విషయంలో రాజీపడకుండా డేటా రూపకల్పన

వివక్షాపూరిత ప్రకటనలకు వ్యతిరేకంగా నియమాలు ఉన్నప్పటికీ, హౌసింగ్, ఉపాధి అవకాశాలు మరిన్నింటితో సహా కొన్ని సేవల నుండి వ్యక్తులను మినహాయించడానికి ప్రకటనకర్తలు నిర్మొహమాటంగా ప్రకటన సాధనాలను ఉపయోగిస్తున్నారని కంపెనీకి ఫిర్యాదులు అందాయి. VRS కొత్త సిస్టమ్ మొత్తం డేటా ఆధారంగా రూపొందించబడింది.అది ఒక నిర్దిష్ట సమూహానికి ఎక్కువ లేదా తక్కువ ప్రదర్శించడానికి ప్రకటన విలువను సర్దుబాటు చేస్తుంది. మెటా హౌసింగ్ యాడ్‌లకు కొత్త సిస్టమ్‌ను వర్తింపజేస్తోంది. వచ్చే ఏడాదిలో దీనిని ఉపాధి, క్రెడిట్ ప్రకటనలకు విస్తరించాలని కంపెనీ ఆలోచిస్తుంది. సిస్టం లో ఉన్నఈ డేటా గోప్యత విషయంలో రాజీపడదు. సెటిల్‌మెంట్‌లో భాగంగా, పక్షపాత అల్గారిథమ్‌ను ఉపయోగించినట్లు ఆరోపించిన 'స్పెషల్ యాడ్ ఆడియన్స్' టూల్‌ను నిలిపివేయడానికి మెటా అంగీకరించింది.