తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?
ఓ వ్యక్తి పీకల దాకా తాగి.. ఆ మత్తులో తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇది జరిగింది.. బస్సులో కాదు, ట్రైన్‌లో కాదు. అమెరికా నుంచి దిల్లీకి వస్తున్న ఢిల్లీ ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఎయిర్ ఇండియా అధికారులు ధృవీకరించారు. నవంబర్ 26, 2022న న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగినట్లు ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిందిన ఎయిర్ ఇండియా.. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించిందన్నారు.
'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని సిఫారసు
మూత్ర విసర్జన ఘటనపై అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిందింతుడిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని ప్రభుత్వానికి ఎయిర్‌ఇండియా సిఫారసు చేసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే.. బోయింగ్, ఎయిర్‌బస్ నుంచి కొన్ని బిలియన్ డాలర్లు వెచ్చించి.. 500 విమానాలను కొనుగోలు చేయడానికి ఎయిర్ ఇండియా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు టాటా గ్రూప్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ డీల్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియాను మార్చడానికి రాబోయే ఐదేళ్లలో దేశీయ మార్కెట్‌లో కనీసం 30 శాతం వాటాను క్లెయిమ్ చేయడానికి సంస్థ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.