NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు బుధవారం అనుకోని సంఘటన ఎదురైంది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (NOTAM) అనే వ్యవస్థ వలన అంతరాయం ఏర్పడి వేలాది విమానాలు ఆగిపోయాయి. అంతరాయం ఫలితంగా 9,700 విమానాలు ఆలస్యం అయ్యాయి, అంతేకాకుండా 2,800 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి. NOTAM విమానాల భద్రతను ప్రభావితం చేసే పరిస్థితుల గురించి పైలట్‌లను అప్రమత్తం చేస్తుంది. ఈ వ్యవస్థను డిసెంబర్ 2021 వరకు "నోటీస్ టు ఎయిర్‌మెన్" అని పిలిచేవారు. అయితే లింగ బేధం లేకుండా చెయ్యాలని అధికారులు పేరును మార్చారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ETకి సిస్టమ్‌లో కొత్త సందేశాలను ప్రాసెస్ చేయడంలో సమస్యలు మొదలయ్యాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపింది.
సెంట్రల్ డేటాబేస్‌లోని కరప్ట్ అయిన ఫైల్ ఈ వైఫల్యానికి దారితీసింది
చట్టబద్ధంగా, ఒక పైలట్ NOTAM సందేశాలను స్వీకరించే వరకు టేకాఫ్ చేయలేరు. ఎనిమిది గంటలకు సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. ఆ రాత్రి తర్వాత, FAA అధికారులు సిస్టమ్‌ను మూసేసి, రీబూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. NOTAM రీబూట్ 90 నిమిషాలు పడుతుంది. సిస్టమ్ రీబూట్ అయింది, కానీ సంబంధిత సమాచారాన్ని బయటకు పంపడం లేదు. సెంట్రల్ డేటాబేస్‌లోని కరప్ట్ అయిన ఫైల్ ఈ వైఫల్యానికి దారితీసినట్లు కనిపిస్తోంది. బ్యాకప్‌లో కూడా అదే ఫైల్ కనుగొన్నారు. ఇంత క్లిష్టమైన సిస్టమ్‌లోకి ఈ ఫైల్ ఎలా ప్రవేశించిందని అని FAA దర్యాప్తు చేస్తోంది. ఈ సంఘటన ద్వారా NOTAMకు అప్‌గ్రేడ్ అవసరమని అర్ధం అయింది. బడ్జెట్ పరిమితుల కారణంగా వాషింగ్టన్ టెక్ అప్‌గ్రేడ్‌ను ఆలస్యం చేస్తోంది.